భారత్లో కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. మంకీపాక్స్ క్లాడ్ 1బి మొదటి కేసు నమోదైంది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు సోమవారం ధృవీకరించాయి. గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మంకీపాక్స్ జాతి అని అధికారులు తెలిపారు. ఈ Mpox క్లాడ్ 1B వేరియంట్ కేసు కేరళకు చెందిన ఒక వ్యక్తిలో కనుగొన్నారు.
లౌకికవాదం పేరుతో భారతదేశ ప్రజలకు "మోసం" జరిగిందని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆరోపించారు. సెక్యులరిజం యూరోపియన్ భావన.. అది భారతదేశంలో అవసరం లేదని తమిళనాడు గవర్నర్ పేర్కొన్నారు. ఆదివారం కన్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగిస్తూ.. ‘‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి,
బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో భారత్ చరిత్ర సృష్టించింది. చెస్ ఒలింపియాడ్ లో తొలిసారి రెండు గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఓపెన్ సెక్షన్లో గ్రాండ్ మాస్టర్ డీ గుకేష్ అద్భుత ప్రదర్శన చేసి తొలి బంగారు పతకం గెలుచుకోగా.. అనంతరం మహిళ జట్టు కూడా మరో స్వర్ణం సాధించి భారత్ చరిత్ర లిఖించింది.
భారతదేశం నుండి అక్రమంగా తరలించబడిన అమూల్యమైన పురాతన వారసత్వాలను అమెరికా ఇండియాకు తిరిగి ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ 297 పురాతన వస్తువులను ప్రధాని మోడీకి అందజేశారు. దీంతో.. 2014 నుండి భారతదేశం నుండి స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువుల మొత్తం సంఖ్య 640కి పెరిగింది.
పాకిస్థానీ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్లు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్' త్వరలో భారతదేశంలో విడుదల కానుందని ఇటీవల ప్రకటించారు.
Indus Water Treaty: దాయాది దేశం, ఉగ్రవాదుల ఉత్పత్తి కర్మాగారంగా ఉన్న పాకిస్తాన్కి భారతదేశం మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ‘‘సింధు జల ఒప్పందాన్ని’’ సమీక్షించాలని పాకిస్తాన్కి నోటీసులు పంపింది. ప్రజల ఆందోళనలు, జనాభా మార్పులు, పర్యావరణ సమస్యలు, శక్తి అవసరాలకు అనుగుణంగా సమీక్షించాలని నోటీసులు జారీ చేసింది. పాకిస్తాన్ పదేపదే భారత్ లక్ష్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న తరుణంలో ఈ చర్య వచ్చింది.
బంగ్లాదేశ్తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసింది. బంగ్లాదేశ్కు భారత్ 515 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 37.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.