దేశీయ విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ ఎంట్రీ ఇవ్వబోతుంది. భారత్లో విమాన సర్వీసులు నడిపేందుకు శంఖ్ ఎయిర్కు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విమానయాన సంస్థ గగనతలంలోకి వెళ్లేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంది.
మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లో ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) దూరపు బంధువులకు రిజర్వేషన్లు కల్పించడం మోసమని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. ఇది మోసమని, దీన్ని అరికట్టాలని చూచించింది. మెడికల్ కాలేజీల్లో ఎన్నారై కోటాను పెంచాలన్న పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్ఆర్ఐల దూరపు బంధువులకు అడ్మిషన్లో రిజర్వేషన్ ప్రయోజనం కల్పించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.…
తమిళనాడులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కీలక చర్యలు చేపట్టింది. దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ రాష్ట్రంలోని హిజ్బ్-ఉత్-తహ్రీర్ అనే సంస్థకు చెందిన 11 మంది అనుమానిత సభ్యుల స్థానాలపై ఎన్ఐఏ దాడులు చేసింది.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన ప్రకటన సెక్యులరిజంపై కొత్త చర్చకు నాంది పలికింది. భారతదేశానికి సెక్యులరిజం అవసరం లేదని, ఇది యూరప్ భావన అని ఆయన అన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ప్రధాని మోడీ మూడు నెలల వ్యవధిలో మూడోసారి భేటీ అయ్యారు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వస్తుండగా.. సోమవారం న్యూయార్క్లో ప్రధాని మోడీ, జెలెన్స్కీ మధ్య సమావేశం జరిగింది.