* ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకు ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్న మోడీ.. లింక్ వెస్ట్ పాలసీ, ఆఫ్రికా ఇనిషియేటివ్‌లో భాగంగా మోడీ పర్యటన.. ఆ ఆదేశాలతో వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనున్న భారత్
* ఢిల్లీ: పడిపోతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్యాస్ ఛాంబర్ లా మారిన ఢిల్లీ.. దేశ రాజధానిలో 400 ల పాయింట్లు దాటిన AQI.. కొన్ని హాట్ స్పాట్ ల్లో 500 పాయింట్ల వరకు నమోదవుతున్న AQI.. ఢిల్లీ ఎన్సీఆర్ లో తగ్గిన విజిబిలిటీ.. కాలుష్యం పెరిగిపోవడంతో గ్రాఫ్ 4 చర్యలు అమలు
* నేడు ఢిల్లీకి చేరుకోనున్న బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్.. ఉదయం 10 గంటలకు బీహార్ నుంచి న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న నితిన్ నబీన్.. ఢిల్లీ సీఎం రేఖా గుప్త ఆధ్వర్యంలో ఘన స్వాగత ఏర్పాట్లు.. ఉదయం 11 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్న నితిన్
* తెలంగాణలో నేటితో ముగియనున్న మూడో విడత గ్రామపంచాయితీ ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్
* కాకినాడ: నేడు అన్నవరం సత్య దేవుని మెట్లోత్సవం.. కొండ దిగువన తొలి పావంచలా దగ్గర స్వామి, అమ్మ వారికి పూజలు అనంతరం ఉత్సవం.. ఉదయం ఆలయంలో గ్రామ సేవ
* ఇవాళ ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ ర్యాలీలు.. జిల్లా కేంద్రాల నుండి ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్న కోటి సంతకాల ప్రతులు.. అక్టోబర్ 10 న ప్రారంభమైన రచ్చబండ – కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. 18న గవర్నర్‌ని కలిసి ప్రజల నిర్ణయాన్ని తెలపనున్న వైఎస్ జగన్.. కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించనున్న జగన్.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపేయాలని కోరనున్న వైఎస్ జగన్
* తిరుమల: రేపు టీటీడీ పాలకమండలి సమావేశం
* ఇవాళ హైదరాబాద్ నుంచి అమరావతికి రానున్న సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం సచివాలయానికి. సీఎం చంద్రబాబు. పలు ముఖ్య శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.
* ప్రకాశం : ఇవాళ ఒంగోలుకు రానున్న అటల్-మోడీ సుపరిపాలన బస్సు యాత్ర.. భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్ పేయి శత జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్య కుమార్ యాదవ్, హాజరుకానున్న బీజేపీ నేతలు..
* అమరావతి: ఇవాళ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న మంత్రి లోకేష్ .. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం.. అశ్వని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ను కలవనున్న లోకేష్.. ఏపీకి సంబంధించి వివిధ అంశాలపై చర్చ.. అమరావతి చట్టబద్ధతకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం..
* అనకాపల్లి జిల్లా: నేడు జిల్లాలో ఇంచార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన.. మంత్రి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జిల్లా అభివృద్ది సమీక్ష సమావేశం….
* విశాఖ: నేడు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట కార్మిక సంఘాల ధర్నా… ఉత్పత్తి ఆధారిత వేతన విధానం రద్దు., సిఎండి ఏకపక్ష నిర్ణయాలపై సీబీఐ విచారణ ప్రధాన డిమాండ్లతో నిరసన
* విశాఖ: నేడు జీవీఎంసీ నుంచి మద్దిలపాలెం జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్న వైసీపీ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను
అమరావతికి పంపుతున్న నాయకత్వం….
* తూర్పు గోదావరి జిల్లా: రేపటి నుండి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో సంసద్ క్రీడా మహోత్సవ్ 2025.. రేపటి నుంచి 21 వరకు పోటీలు నిర్వహణ.. 21 న మారథాన్ నిర్వహణ.. 22 న ముగింపు వేడుకలు
* తిరుపతి: నేటి నుంచి నగరంలో నో హెల్మెట్.. నో హెల్మెట్… హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు..