దేశంలో అక్టోబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను శుక్రవారం కేంద్రం వెల్లడించింది. వస్తు,సేవల పన్ను వసూళ్లు మరోసారి గణనీయంగా పెరిగాయని తెలిపింది. అక్టోబర్ నెలలో రూ.1.87 లక్షల కోట్లు వసూలైనట్లు చెప్పింది.
IND vs SA T20: భారత్తో స్వదేశంలో జరిగే టి20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా తన జట్టును ప్రకటించింది. నవంబర్ 8 నుంచి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య 4 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్కు భారత జట్టు తన జట్టును ప్రకటించింది. భారత్ తర్వాత ఇప్పుడు దక్షిణాఫ్రికా కూడా టీ20 సిరీస్కు జట్టును ప్రకటించింది. ఈ సిరీస్లో ఐడెన్ మార్క్రామ్ ఆఫ్రికన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు…
ఆపిల్ ఇప్పుడు తన ఐఫోన్17 యొక్క బేస్ మోడల్పై పని చేయడం ప్రారంభించినట్లు సమాచారం. దీనిని ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 2025 నెలలో ప్రారంభించవచ్చని అంచనాలు ఉన్నాయి. గత నెలలో యాపిల్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 16 సిరీస్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
దీపావళి పండుగను భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు. హిందూ మతంలో దీపావళి పండుగకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గణేశుడిని, లక్ష్మి దేవిని పూజిస్తారు. దీనితో పాటు ప్రజలు తమ ఇళ్లలో దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే... దీపావళి పండుగను భారతదేశంలో పలు ప్రాంతాల్లో జరుపుకోరు. అక్కడ పటాకులు కూడా కాల్చరు.
గత కొన్ని సంవత్సరాలుగా.. దీపావళి, ధన్తేరస్లలో భారతీయ మార్కెట్లలో చైనా ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతోంది. ముఖ్యంగా అలంకరణ వస్తువుల విక్రయాలు గతంతో పోలిస్తే ఈ సారి గణనీయంగా తగ్గాయి. తక్కువ డిమాండ్ కారణంగా.. దిగుమతులు కూడా తగ్గుతున్నాయి. దీని కారణంగా దేశీయ వస్తువుల అమ్మకాలు పెరుగుతున్నాయి. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచార ప్రభావం ఇప్పుడు దేశంలో కనిపిస్తోంది. దేశీయ వస్తువులనే కొనుగోలు చేయాలన్న ఆయన నినాదం చైనాపై తీవ్ర ప్రభావం…
బ్రిటన్ రాజు పర్యటన అంటే ఎంతో హడావుడి.. హంగామా ఉంటుంది. అలాంటిది బ్రిటన్ రాజు చార్లెస్ దంపతులు భారత్లో పర్యటిస్తున్నారంటే ప్రొటోకాల్ ప్రకారం భారీ బందోబస్తు.. పోలీసుల హడావుడి ఉంటుంది. అలాంటిది చార్లెస్ దంపతులు గత వారం నుంచి దక్షిణ భారత్లోని బెంగళూరులో ఉంటున్న సంగతి ఎవరికీ తెలియలేదు.