Anurag Thakur: ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. కానీ ఈ మ్యాచ్ను బ్యాన్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ మ్యాచ్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ క్రీడా మంత్రి స్పందించారు. క్రికెట్ కౌన్సిల్ (ACC) లేదా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించే టోర్నమెంట్లలో ఇటువంటి మ్యాచ్లను ఆపలేమని మాజీ క్రీడా మంత్రి, ప్రస్తుత…
IIT Baba: మహా కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన ‘‘ఐఐటీ బాబా’’ గురించి అందరికి తెలిసిందే. అభయ్ సింగ్ అనే ఐఐటియన్ బాబాగా మారడంపై మీడియా ప్రత్యేక కథనాలను కూడా ప్రచురించింది. ఇటీవల, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలుస్తుందని జోస్యం చెప్పడంతో మరోసారి ఈ బాబా వైరల్ అయ్యారు. అయితే, ఈ మ్యాచ్లో భారత్ చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడంతో, ఐఐటీ బాబాపై ట్రోల్స్ వచ్చాయి.
విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసించారు.
Udaynidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు పాలైన ఉదయనిధి స్టాలిన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. శనివారం అహ్మదాబాద్ వేదికగా ఇండియా-పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఔటై వెళ్తున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ‘జైశ్రీరాం’ నినాదాలు చేశారు. అయితే దీనిపై మాట్లాడిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. జైశ్రీరాం నినాదాలను ఖండించారు.
జై షా.. బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్.. అంతకు మించి కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా కుమారుడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కనిపించిన ఓ దృశ్యం.. ఇప్పుడు కొత్తగా వివాదాలకు కేంద్రబిందువు అయింది. జై షా చుట్టూ వివాదాలు ఇప్పుడిప్పుడే ముసురుకుంటోన్నాయి.
ఆసియా కప్లో ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. అసలు సిసలైన మ్యాచ్కి సమయం ఆసన్నమైనది.. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్… యుఏఈ వేదికగా తలపడనున్నాయి… దాయాది జట్ల మధ్య రసవత్తర పోరు జరిగితే ఆ మ్యాచ్.. ఓ చిన్న యుద్ధంలాగే ఉంటుంది. ఎప్పుడూ క్రికెట్ చూడనివారు కూడా.. ఈ మ్యాచ్ చూసి తీరుతుంటారు.. అభిమానుల కోలాహోలం మధ్య ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే రాజకీయ కారణాల వల్ల ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగనప్పటికీ.. ఐసీసీ టోర్నీ,…
యూఏఈలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు తన ప్రయాణాన్ని పాకిస్థాన్ తో మొదలు పెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక తాజాగా ఈ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు అని ఐసీసీ ప్రకటించింది. మన జట్టు ఓడిపోయినా.. ఇండియాలోనే ఈ మ్యాచ్ ను అత్యధికంగా 15.9 బిలియన్ నిమిషాలపాటు అభిమానులు చూసారు. ఇక ఇన్ని రోజులు ఈ అత్యధిక…