NIA: ఇండియా, కెనడాల మధ్య ఖలిస్తాన్ వేర్పాటువాదం చిచ్చుపెట్టింది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఈ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమైంది. జూన్ నెలలో కెనడా సర్రే ప్రాంతంలో నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దీంతో ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి.
Canada Issue: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడం రెండు దేశాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించుకోవడంతో ఈ ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఈ వివాదంపై అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు తమ ఆందోళనలను తెలియజేశాయి.
India vs Canada: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యవెనక భారత్ ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో ఆరోపించడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా కెనడా సీనియర్ దౌత్యవేత్తను 5 రోజుల్లో భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలని భారత్ ఖండించింది.
India vs Canada: ఖలిస్తానీ వేర్పాటువాదానికి మద్దతు నిలుస్తున్న కెనడా తీరుపై భారతదేశం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. ఇదిలా ఉంటే కెనడా పౌరుడు, ఖలిస్తానీ వేర్పాటువాది, ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడం, ఆ దేశ విదేశాంగ మంత్రి భారత అత్యున్నత దౌత్యవేత్తను బహిష్కరించింది.