డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని ప్రధాన వాణిజ్య ఒప్పంద సంధానకర్త బ్రెండన్ లించ్ మంగళవారం భారత ప్రతినిధులతో భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై పూర్తి రోజు చర్చలు జరపనున్నారు. భారత దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకం విధించిన తర్వాత ప్రభావితమైన వాణిజ్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే దిశగా ఈ సమావేశం కీలకంగా మారనుంది. Also Read:Hyderabad : రాయదుర్గం భూముల వేలానికి సర్కార్ రెడీ భారతదేశం -అమెరికా వాణిజ్య సంబంధాలపై ట్రంప్ చేసిన సానుకూల…
JPMorgan CEO: డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ‘‘పరస్పర సుంకాలు’’ విధించడం సొంత దేశంలోని ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఇటీవల ‘‘హ్యాండ్స్ ఆఫ్’’ నిరసనలు జరిగాయి. యూఎస్ వ్యాప్తంగా పలు నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. మరోవైపు, ట్రంప్ టారిఫ్స్ అమలులోకి వచ్చే ముందే, తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు అమెరికన్లు సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు.
Donald Trump: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన రెండు దేశాలకు కీలకంగా మారాయి. పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య వాణిజ్యంపై ట్రంప్, మోడీ చర్చించారు. చర్చల అనంతరం ఇరువురు నేతలు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని మోడీతో భేటీకి ముందు ట్రంప్ ‘‘పరస్పర సుంకాల’’పై ప్రకటన చేశాడు. మీలో కఠినమైన,
Donlad Trump: ప్రధాని నరేంద్రమోడీ, డొనాల్డ్ ట్రంప్‌తో భేటీపై రెండు దేశాలతో పాటు ప్రపంచవ్యా్ప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మేరకు ఇద్దరు నేతల మధ్య ప్రపంచ రాజకీయాలు ప్రస్తావనకు వచ్చాయి. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ట్రంప ఖండించినట్లు తెలుస్తోంది. అయితే, బంగ్లాదేశ్‌కి సంబంధించిన విషయాన్ని మోడీకి వదిలేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
S Jaishankar: భారత్-అమెరికా మధ్య సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌ని ‘‘అమెరికన్ జాతీయవాది’’గా జైశంకర్ అభివర్ణించారు. ఢిల్లీ యూనివర్సిటీలోని హన్స్‌రాజ్ కాలేజీలో గురువారం జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆయన మాట్లాడుతూ... ప్రపంచ దౌత్య స్వభావం, భారతదేశం విధానాన్ని గురించి చెప్పారు.
USA: భారత్-రష్యా సంబంధాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సంబంధాలపై ఆందోళన ఉన్నప్పటికీ అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించారు. పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
వరుసగా మూడో ఏడాది కూడా రికార్డు స్థాయిలో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. ఇటీవల విడుదలైన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ (ODR) ప్రకారం, భారతదేశం నుంచి యునైటెడ్ స్టేట్స్‌కు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 35 శాతం పెరిగినట్లు తెలిసింది. 2022-23 విద్యా సంవత్సరంలో 268,923 మంది విద్యార్థులు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నారు.