Donlad Trump: ప్రధాని నరేంద్రమోడీ, డొనాల్డ్ ట్రంప్‌తో భేటీపై రెండు దేశాలతో పాటు ప్రపంచవ్యా్ప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మేరకు ఇద్దరు నేతల మధ్య ప్రపంచ రాజకీయాలు ప్రస్తావనకు వచ్చాయి. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ట్రంప ఖండించినట్లు తెలుస్తోంది. అయితే, బంగ్లాదేశ్‌కి సంబంధించిన విషయాన్ని మోడీకి వదిలేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
Read Also: High Court: శారీరక సంబంధం లేకుండా భార్య వేరే వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు..
వాషింగ్టన్‌లో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, ఇద్దరు నాయకులు భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్యం, ఇతర సంబంధాలపై చర్చించారు. మోడీ, ట్రంప్ ఇద్దరూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బంగ్లాదేశ్ విషయంలో మీ పాత్ర ఏమిటని మీడియా ప్రశ్నించగా, డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ… ‘‘మా డీప్ స్టేట్ ఎటువంటి పాత్ర లేదు. ఇది ప్రధానమంత్రి(మోడీ) చాలా కాలంగా డీల్ చేస్తున్నారు. నేను బంగ్లాదేశ్‌ని ప్రధానికి వదిలేస్తున్నాను’’ అని అన్నారు.
ట్రంప్‌తో భేటీకి ముందు అమెరికా జాతీయ నిఘా విభాగ అధిపతి తులసీ గబ్బార్డ్‌తో మోడీ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ పరిస్థితుల గురించి చర్చించారు. గతేడాది ఆగస్టులో విద్యార్థి ఉద్యమం తర్వాత ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ నియమితులయ్యారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అత్యాచారాలు, హత్యలు చోటు చేసుకున్నాయి. భారత్ ఎంతగా చెప్పినప్పటికీ యూనస్ దీనిప చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య స్నేహం పెరిగింది. బంగ్లా వ్యాప్తంగా భారత్ వ్యతిరేకతను పెంచి పోషించారు.
#WATCH | Washington, DC: When asked about the Bangladesh issue, US President Donald Trump says, " There is no role for our deep state. This is something that PM has been working on for a long time and has worked on for hundreds of years…I have been reading about it. I will… pic.twitter.com/0B8Ortxx60
— ANI (@ANI) February 13, 2025