USA: భారత్-రష్యా సంబంధాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సంబంధాలపై ఆందోళన ఉన్నప్పటికీ అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించారు. పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. పుతిన్, మోడీ ఇద్దరు రెండు దేశాల సంబంధాలపై మాట్లాడారు. ఇదే విధంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని, యుద్ధం పరిష్కారం కాదని మోడీ, పుతిన్‌తో చెప్పారు. బాంబులు, బుల్లెట్ల మధ్య శాంతి ప్రయత్నాలు విజయవంతం కావని అన్నారు.
Read Also: Crime: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్యపై సవతి కొడుకు అత్యాచారం..
మంగళవారం రష్యాతో భారత్ సంబంధాలపై, మోడీ రష్యా పర్యటనపై పెంటగాన్, యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధులు విడివిడిగా స్పందించారు. ‘‘భారతదేశం మరియు రష్యా చాలా కాలంగా బంధాన్ని కలిగి ఉన్నాయి. యుఎస్ దృష్టికోణంలో, భారతదేశం ఒక వ్యూహాత్మక భాగస్వామి, దీనితో మేము రష్యాతో వారి సంబంధాన్ని చేర్చడానికి పూర్తి మరియు స్పష్టమైన సంభాషణను కొనసాగిస్తాము. ఈ వారం జరగబోయే నాటో శిఖరాగ్ర సమావేశంతో ముడిపడి ఉంది. మీలాగే ప్రపంచం కూడా ఈ విషయంపై దృష్టి పెట్టింది.’’ అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ పాట్ రైడర్ ఒక వార్తా సమావేశంలో విలేకరులతో అన్నారు.
యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ.. ‘‘రష్యాతో భారత్ సంబంధాల గురించి అమెరికా చాలా స్పష్టంగా ఉంది’’ అని చెప్పారు. దీనిని భారత్ ప్రభుత్వంతో ప్రైవేటుగా వ్యక్తపరిచామని అన్నారు. మేజర్ జనరల్ రైడర్ మాట్లాడుతూ.. భారతదేశాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా చూడటం కొనసాగిస్తాము. మేము వారితో బలమైన సంభాషణను కొనసాగిస్తాము అని చెప్పారు. పుతిన్ ఈ పర్యటన ద్వారా తాము మిగతా ప్రపంచంతో వేరుకాలేదని చూపించుకునేందుకు ప్రయత్నించారని అన్నారు. నిజానికి పుతిన్ ఈ యుద్ధం ద్వారా మిగతా ప్రపంచంతో రష్యాను వేరు చేశారని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత(మోడీ), పుతిన్‌ని కౌగిలించుకోవడం చూస్తే ఆయన ప్రపంచం నుంచి ఏకాకి కాలేదని అనిపిస్తోదని విలేకరులు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు.