US Embassy: అమెరికాలోని న్యూవార్క్ విమానాశ్రయంలో భారతీయ విద్యార్థికి అక్కడి అధికారులు చేతికి సంకెళ్లు వేసి, బహిష్కరించిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అమెరికా తీరును ప్రవాస భారతీయులతో పాటు, దేశంలోని ప్రజలు ఖండించారు. అయితే, ఈ ఘటనపై భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది.
Trump's Tariff: డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటించబోతున్నాడు. ఏప్రిల్ 2 ‘‘విముక్తి దినోత్సం’’ సందర్భంగా ఇండియాతో పాటు ఇతర దేశాలపై సుంకాలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై అంతా ఉత్కంఠత నెలకొంది. పరస్పర సుంకాలు ఏప్రిల్ 3 నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌజ్ మంగళవారం తెలిపింది.
Tariff cuts: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుంకాల పేరుతో భయపెడుతున్నారు. ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై టారిఫ్స్ విధించాడు. ఇండియా కూడా తమ ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తోందని బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు తమతమ ఉత్పత్తులపై సుంకాల విధింపును పరిశీలిస్తున్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా 23 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతుల్లో సగానికి పైగా సుంకాలు తగ్గించడానికి భారత్…
Green Card: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడంతో పాటు అమెరికా పౌరసత్వంపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు. వలసలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనను పెంచాయి. ముఖ్యంగా భారతీయులతో పాటు ఆ దేశంలో స్థిర నివానం ఏర్పరుచుకోవాలనుకునే వారికి షాక్ ఇచ్చారు. ఆయన ‘‘గ్రీన్ కార్డు’’లపై చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.
PM Modi: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. వైట్ హౌజ్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల గురించి చర్చించారు. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇదిలా ఉంటే, ట్రంప్‌తో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో, ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్(MIGA)’ అని అన్నారు. ట్రంప్ అమెరికాని ‘‘మేక్ అమెరికా…
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే 2025ను సమర్పించారు. దీని ప్రకారం.. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. రాబోయే ఒకటి లేదా రెండు దశాబ్దాలకు ఏటా సగటున 8% జీడీపీ వృద్ధిని సాధించాలి.
India: భారతదేశం నుంచి పారిపోయిన ప్రతీ మూడో వ్యక్తి అమెరికాలో ఆశ్రయం పొందుతున్నాడని, ఇది నేరస్థులకు, ఉగ్రవాదులకు ‘‘సురక్షిత స్వర్గధామం’’గా మారిందని హోం మంత్రిత్వ శాక మంగళవారం పార్లమెంట్‌కి తెలిపింది.
వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అదానీ లంచం కేసు మా దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన సమాచారం ఇస్తుందన్నారు. ఇక, భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
India-USA: భారత్, అమెరికా మధ్య ఈ రోజు ఇరు దేశాల 2+2 మంత్రుల సమావేశం జరిగింది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగమంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడేలా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి.