Tariff cuts: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుంకాల పేరుతో భయపెడుతున్నారు. ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై టారిఫ్స్ విధించాడు. ఇండియా కూడా తమ ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తోందని బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు తమతమ ఉత్పత్తులపై సుంకాల విధింపును పరిశీలిస్తున్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా 23 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతుల్లో సగానికి పైగా సుంకాలు తగ్గించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రభుత్వం వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది.
ఎగుమతుల్ని దెబ్బతీసే పరస్పర సుంకాలను నిరోధించే లక్ష్యంతో, ఇది ఏడాదిలోనే అతిపెద్ద సుంకాల కోత అవుతుంది. ఏప్రిల్ 2 నుంచి ‘‘పరస్పర సుంకాలు’’ అమలులోకి వస్తుందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో భారత్ దీనిని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. భారత్ అంతర్గత విశ్లేషణ ప్రకారం, కొత్త యూఎస్ సుంకాలు అమెరికాకు భారత ఎగుమతుల్లో 87 శాతంపై ప్రభావం చూపచ్చు. ఇది దాదాపుగా 66 బిలియన్ డాలర్ల విలువైనవని భారత ప్రభుత్వ వర్గాలు రాయిటర్స్‌తో చెప్పారు. ఈ ప్రభావాన్న నివారించడానికి ప్రస్తుతం 5 శాతం, 30 శాతం మధ్య పన్ను విధించబడుతున్న 55 శాతం యూఎస్ దిగుమతులపై సుంకాలను తగ్గించడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సుంకాలను గణనీయంగా తగ్గించవచ్చు, మరికొన్నింటిపై పూర్తిగా తొలగించదు.
Read Also: CSIR CRRI Recruitment 2025: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. 81 వేల జీతం
అయితే, ఈ ప్రతిపాదన ఇంకా చర్చల దశలో ఉంది. భారత్ దీనిపై నిర్ణయం తీసుకోలేదు. విస్తృత సుంకాల కోతకు బదులుగా నిర్దిష్ట రంగాలకు సుంకాలను సర్దుబాటు చేయడం మరియు బహుళ పరిశ్రమలలో సుంకాలను తగ్గించడం కంటే ఎంచుకున్న ఉత్పత్తులకు తగ్గింపులపై చర్చలు జరపడం వంటి ఇతర ఎంపికలను పరిశీలిస్తున్నారు. డేటా ప్రకారం, అమెరికా వాణిజ్య సుంకాల విలువ 2.2 శాతం ఉంటే, భారత్‌కి 12 శాతంగా ఉంది. భారత్‌తో అమెరికాకు 45.6 బిలియన్ డాలర్ల లోటు ఉంది.
నివేదిక ప్రకారం భారతదేశం బాదం, పిస్తా, ఓట్ మీల్, క్వినోవాపై సుంకాలను తగ్గించవచ్చు. మాంసం, మొక్కజొన్న, గోధుమ, పాల ఉత్పత్తులపై సుంకాలను తగ్గించదు. ప్రస్తుతం, 100 శాతం దాటి ఆటోమొబైల్స్‌పై సుంకాలను తక్షణ కోత ద్వారా కాకుండా క్రమక్రమంగా తగ్గించవచ్చు. అమెరికా పరస్పర సుంకాలు ఔషధాలు, ఆటోమొబైల్స్, విద్యుత్ పరికరాలు, యంత్రాలు వంటి కీలక ఎగుమతి పరిశ్రమలను దెబ్బతీస్తాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ముత్యాలు, ఖనిజ ఇంధనాలు, యంత్రాల వంటి ఉత్పత్తులపై సుంకాలు 6% నుండి 10% వరకు పెరగవచ్చు, ఇది భారతదేశం అమెరికాకు చేసే మొత్తం ఎగుమతుల్లో సగభాగాన్ని ప్రభావితం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత ఎగుమతులపై సుంకాలు పెరిగితే, యుఎస్ కంపెనీలు ఇండోనేషియా, ఇజ్రాయెల్ మరియు వియత్నాం వంటి ఇతర సరఫరాదారులకు మారవచ్చు, ఇది భారతీయ వ్యాపారాలను మరింత ప్రభావితం చేస్తుంది.