PM Modi: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. వైట్ హౌజ్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల గురించి చర్చించారు. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇదిలా ఉంటే, ట్రంప్‌తో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో, ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్(MIGA)’ అని అన్నారు. ట్రంప్ అమెరికాని ‘‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA)’ మారుస్తానని ప్రకటించారు. ఇదే విధంగా మోడీ కూడా ఇండియాను గొప్పగా మారుస్తానని అన్నారు.
Read Also: VishwakSen : నేనేం భయపడను.. నాకు సినిమాలు చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు : విశ్వక్ సేన్
రెండు దేశాల ‘మాగా’, ‘మిగా’ కలిస్తే ‘మెగా’ భాగస్వామ్యంగా మారుతుందని ప్రధాని అన్నారు. ‘‘ అమెరికా ప్రజలకు ట్రంప్ నినాదం మాగా-అమెరికాను గొప్పగా చేయండి’ గురించి బాగా తెలుసు, భారత్ ‘‘వికసిత భారత్ 2047’’ లక్ష్యంగా ముందుకు వెళ్తోందని, అమెరికా భాషలో చెప్పాలంటే ‘‘మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్-MIGA’’ అని అన్నారు. రెండు దేశాల లక్ష్యాలు కలిస్తే మెగాగా మారుతుందని చెప్పారు.
2030 నాటికి భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేరాలని ఇరువురు నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాల కోసం ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని మోడీ చెప్పారు. రెండు దేశాలు ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తి మరియు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ దిశలో ముందుకు సాగుతున్నాయని అన్నారు.