Russia: భారత్, చైనాలను ఇబ్బంది పెట్టే విధంగా అమెరికా సుంకాలను విధిస్తోంది. అయితే, వీటిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించారు. ట్రంప్ విధానాలను ప్రశ్నించారు. భారత్, చైనా వంటి దేశాలపై అమెరికా ఒత్తిడి విజయవంతం కాదని చెప్పారు. పురాతన నాగరికతలు కలిగిన ఈ రెండు దేశాలు యూఎస్ అల్టిమేటంకు లొంగవని అన్నారు.
భారతదేశం పరస్పర సంబంధాలు ,వాణిజ్యానికి విశాల దృక్పథాన్ని కలిగి ఉంది, కానీ ఏకపక్ష నిర్ణయాలు మరియు ఒత్తిడి వ్యూహాలకు తలొగ్గదు’ అని అన్నారు భారత మాజీ దౌత్యవేత్త ఫాబియన్. పూర్తి వివరాల్లోకి వెళితే..ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై కఠిన వైఖరి తీసుకుని, రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకం విధించారు, ఆ తర్వాత భారతదేశంపై మొత్తం అమెరికా సుంకం 50 శాతానికి పెరిగింది. దీని కారణంగా, రెండు…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇండియాపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. భారతదేశం అమెరికా వస్తువులపై తన సుంకాలను సున్నాకు తగ్గించడానికి ఆఫర్ చేసిందని, అయితే న్యూఢిల్లీ కొన్ని ఏళ్లకు ముందే ఈ పని చేయాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని సోమవారం ట్రంప్ అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై 25 శాతం పరిస్పర సుంకాలను విధించడంతో పాటు, రష్యా చమురు కొంటున్నామనే కారణంగా మరో 25 శాతం మొత్తంగా…
Donald Trump: తాను చేస్తే న్యాయం, అదే ఇతరులు చేస్తే అన్యాయం అన్న రీతిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. అమెరికా రష్యాతో వ్యాపారం చేసుకోవచ్చు, కానీ భారత్ చేస్తే మాత్రం అది ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చడం అని విమర్శిస్తోంది. ఇదే కారణం చెబుతూ ట్రంప్, భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించారు. అయితే, అంతటితో ఆగకుండా తాను చేస్తున్న పనినే మీరు చేయాలంటూ పలు దేశాలకు అమెరికా సూచిస్తోంది. ఇందతా చూస్తుంటే ‘‘తాను…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాలను ప్రకటించిన తర్వాత కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. “ఇటీవలి రోజుల్లో, రష్యా నుంచి భారతదేశం చేసుకునే చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. మా చమురు దిగుమతులు మార్కెట్ ఆధారితమైనవి. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతను నిర్ధారించడం దాని ప్రధాన లక్ష్యం అనే విషయంతో సహా ఈ అంశాలపై మేము ఇప్పటికే మా వైఖరిని స్పష్టం చేసాము.…
USA: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకుడు విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ నిధులు సమకూరుస్తోందని ట్రంప్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే స్టీఫెన్ మిల్లర్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ పరిపాలన ఒత్తిడి తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
భారత్ వంటి దేశాలపై బెదిరింపులు మంచిది కావనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక, యూరోపియన్ దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నప్పటికీ, వాటిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు.