Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ తన త్రివిధ దళాల శక్తిని పాకిస్తాన్‌కి రుచిచూపించింది. పాక్‌తో పాటు దాని ఇద్దరు మిత్రులు చైనా, టర్కీలకు కూడా దెబ్బ తగిలింది. అయితే, మే 9-10 రాత్రిలో భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. 13 పాక్ వైమానిక స్థావరాల్లో 11 స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ సైన్యం నడ్డి విరిచింది. అయితే, ఈ ఆపరేషన్ నిర్వహించడానికి భారత్ మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు ప్రతీ విషయంలోనూ పాకిస్తాన్‌కి చైనా సపోర్టు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. చైనా మద్దతుతో పాటు టర్కీ కూడా భారత్‌పై దాడిలో పరోక్షంగా, ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. గత వారం జరిగిన భారత్-పాకిస్తాన్ మధ్య వైమానిక పోరాటంలో చైనా పాత్ర స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భూభాగంలోకి భారత్ ఫైటర్ జెట్‌లు వెళ్లిన సమయంలో, పాకిస్తాన్ చైనీస్ PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను ప్రయోగించింది.
Operation Sindoor: భారతదేశం ఇటీవల పాకిస్తాన్‌పై చేపట్టిన ‘‘ఆపరేషన్ సిందూర్’’కి భయపడిందని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. భారతదేశం, పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో ‘‘కాళ్ల మధ్య తోకతో భయపడిన కుక్కలా పాకిస్తాన్ కాల్పులు విరమణ కోసం ప్రయత్నించింది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ఫెలోగా ఉన్న రూబిన్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ఎలా భయపడిందనే విషయాలను వెల్లడించారు. పాకిస్తాన్ సైన్యం ఘోరంగా ఓడిపోయిందని అన్నారు.…
IPL 2025: ఐపీఎల్ 2.0 కి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల పదిహేడు నుంచి ఐపీఎల్ పునప్రారంభం కానుంది. మొత్తం 17 మ్యాచ్‌లు జరగనుండగా అందులో 13 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లేఆఫ్ మ్యాచులు జరుగుతాయి. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. అయితే భారత్ పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా విదేశీ ఆటగాళ్లు తమ దేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీసీసీఐ ఐపీఎల్…
Turkey: చైనాకు మద్దతు ఇస్తూ భారత్‌కి వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుందో గతంలో మాల్దీవులకు తెలిసి వచ్చింది. చివరకు భారత్ శరణుజొచ్చింది. ప్రస్తుతం టర్కీ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, టర్కీ పాకిస్తాన్‌కి మద్దతు ఇస్తూ వస్తోంది.
Droupadi murmu: ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల పర్యటన ఖరారైంది. ఈ నెల 19న ఆమె శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ద్రౌపది ముర్ము శబరిమల పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 18న కొట్టాయం చేరుకుంటానని, 19న శబరిమల సందర్శన చేస్తానని ప్రకటన వెలువడింది. రాష్ట్రపతి భవన్ ఈ కార్యక్రమ వివరాలను ఈ రోజు కేరళ ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రపతి…
పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యల కారణంగా పాకిస్తాన్ భారీ నష్టాలను చవిచూసింది . ఆపరేషన్ సిందూర్‌లో, పాకిస్తాన్‌లో పెంచి పోషించిన అనేక మంది భయంకరమైన ఉగ్రవాదులను నాశనం చేశారు. ఆ తర్వాత పాక్ భారత్ పై దాడి చేసింది. భారత్ జరిపిన ప్రతీకార దాడుల్లో చాలా మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. పాకిస్తాన్ స్వయంగా దీనిని అంగీకరించింది. రెండు పొరుగు దేశాల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత సైన్యం జరిపిన దాడిలో…
భారత్ పహల్గాం టెర్రర్ ఎటాక్ కు ప్రతీకారంగా పాక్ కు తగిన బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ను గడగడలాడించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ పై మరింత ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయ్యింది. ద్వైపాక్షిక ఒత్తిడి తెచ్చేందుకు నేడు పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇవ్వనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు త్రివిధ దళాల డైరెక్టర్ జనరల్స్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్,…
Viral Video: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌ని చావు దెబ్బ తీసింది. ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడి చేసిన తర్వాత, మన దేశ భూభాగాల్లోని పౌరులు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, విమానాలు, మిస్సైళ్లతో దాడులకు పాల్పడింది. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా వీటిని అడ్డుకున్నాయి.
Manoj Naravane: భారతదేశం, విజయవంతంగా పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్న సమయంలో కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకుందని, మరికొన్ని రోజులు పాటు యుద్ధం చేసి పీఓకేని స్వాధీనం చేసుకుంటే బాగుండేదని దేశంలోని పలువురు అనుకుంటున్నారు. మరికొంత మంది బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినట్లు బెలూచిస్తాన్‌ని కూడా ఏర్పాటు చేస్తే బాగుండేదని వాదిస్తున్నారు. కొందరు యుద్ధం ఆగిపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.