పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం భారత్ ప్రతీకార ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘర్షణ సైనిక చర్యలే కాకుండా వాటర్ వార్, దౌత్యదాడికి దిగుతోంది భారత్. పాక్ పై మళ్లీ వాటర్ వార్ కు దిగింది. ఈరోజు ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ ఆనకట్ట 5 గేట్లను తెరిచారు. దీంతో పాకిస్తాన్ వైపు నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. Also…
India Pakistan: పాకిస్తాన్ భారతదేశంలో చేస్తు్న్న ఉగ్రవాద దాడుల్ని కవర్ చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వీడియోలను వాడుతోంది. ఇటీవల, పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలితీసుకున్నారు
India Pak War: పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలను, వాటి శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100కు మించి ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం, పాక్ భారత్‌పై దాడికి పాల్పడింది. దీని తర్వాత మరోసారి ఇండియా
IND vs PAK: పాకిస్తాన్ మళ్ళీ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడటంతో, భారత్ గట్టిగా బుద్ధి చెబుతోంది. పాక్ కాల్పులకు ఇండియన్ ఆర్మీ ధీటుగా జవాబు ఇస్తుంది. ఈ నేపథ్యంలో భారత్- పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
India Pakistan war: గురువారం రాత్రి పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడుల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించింది. నిన్న రాత్రి జరిగిన దాడిలో భారత సైనిక స్థావరాలను టార్గెట్ చేసినట్లు కల్నర్ సోషియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు.
Asim Munir: ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎక్కడ..? అనే ప్రశ్న అందరితో మెదులుతోంది. మీడియాలో వస్తు్న్న వార్తల ప్రకారం, ఆసిమ్ మునీర్‌ని ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ మొత్తం ఉద్రిక్తతకు కారణం మాత్రం ఆసిమ్ మునీరే. ఆయన చేసిన విద్వేష ప్రసంగం తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. హిందూ-ముస్లింలు వేరని హిందువుల పట్ల, భారత్ పట్ల ద్వేషాన్ని…
India Pakistan War: గురువారం రాత్రి దాయాది దేశం పాకిస్తాన్, భారత్‌పై దుష్ట పన్నాగానికి పాల్పడింది. అయితే, భారత్ తన గగనతల రక్షణ వ్యవస్థలతో ఈ దాడిని తిప్పికొట్టింది. మే 8 రాత్రి, 8 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య పాకిస్తాన్ ఏకంగా భారత్‌పైకి 500 డ్రోన్లతో అటాక్ చేసినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని 24 నగరాలను లక్ష్యంగా చేసుకుని చిన్న డ్రోన్లను…
S-400 sudarshan chakra: పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణుల నుంచి భారత్‌ని ‘‘S-400 సుదర్శన చక్ర’’ క్షిపణి రక్షణ వ్యవస్థ కాపాడుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఇది ఒకటి. అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల నుంచి వస్తున్న వైమానిక దాడులను తిప్పికొడుతుంది. గురువారం రాత్రి సమయంలో పాకిస్తాన్ దాడిని కూడా ఈ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ పనితీరుపై ఇప్పుడు అందరు ప్రశంసలు కురిపిస్తాను. కానీ,…
Pakistan: ‘‘ఆపరేషన్ సింధూర్’’ దెబ్బ పాకిస్తాన్‌కి బాగా తగినట్లు ఉంది. అయితే, ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో మాత్రం భారత్ దాడి వల్ల నష్టపోయామని ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్ జరిపిన దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని, తన ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.
Ajay Banga: పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ పరిణామాల మధ్య ‘‘ప్రపంచ బ్యాంక్’’ అధ్యక్షుడు అజయ్ బంగా గురువారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. పాకిస్తాన్, పీఓకేలలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిన ఒక రోజు తర్వాత ఆయన మోడీని కలిశారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది.