Unnao Rape Case: ఉన్నావ్ మైనర్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగర్‌కు సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 2017లో జరిగిన మైనర్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సోమవారం సుప్రీంకోర్టు నిలిపివేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత, బాధితురాలు స్పందిస్తూ.. “సుప్రీంకోర్టు తీర్పు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. సుప్రీంకోర్టు న్యాయం చేసింది. అయితే సెంగర్‌కు ఉరిశిక్ష పడేవరకు నా పోరాటం…
విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టయిన ముంబైలోని ప్రముఖ పాఠశాలకు చెందిన 40 ఏళ్ల ఉపాధ్యాయురాలికి బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. బాధిత విద్యార్థి వయస్సు 17 ఏళ్లు పైబడి ఉందని ప్రత్యేక న్యాయమూర్తి సబీనా ఎ మాలిక్ తెలిపారు.
ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నట్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటువంటి తీర్పులు వెలువడినప్పుడు మైనింగ్ లో అక్రమాలు చెయ్యాలనుకునే వారికి దడ పుడుతుందన్నారు.. ఇలాంటి కేసులకు ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పుని వెలువర్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఎంత ఆలస్యం అయితే అంత నీరుగారే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేశారు..