అమెరికాలో 6 కోట్లకు చేరిన కరోనా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణుకు పుట్టిస్తోంది. ప్రపంచంలో 30 కోట్ల కేసులు నమోదైతే.. అందులో ఆరు కోట్ల కేసులు అమెరికాలోనే బయటపడ్డాయి. ఇక థర్డ్‌వేవ్‌లో ప్రతి రోజు లక్షల మందికి కరోనా సోకడం అమెరికాను కలవరపెడుతోంది. అమెరికాలో 14 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల సగటును పరీక్షిస్తే ప్రతి సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
కరోనా చైనాలో పుట్టినా.. ప్రపంచంలో అత్యధికంగా వైరస్‌తో అతలాకుతలమైంది మాత్రం అమెరికానే. ఫస్ట్‌వేవ్‌లో ప్రతి రోజు వేల సంఖ్యలో కొవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రోజు లక్షల్లో కేసులు నమోదయ్యాయి. అదే వైరస్ దూకుడు.. ఇప్పుడు థర్డ్‌వేవ్‌లోనూ కంటిన్యూ అవుతోంది. ఇప్పటి వరకు అమెరికాలో నమోదైన కేసులు.. 60 మిలియన్లకు చేరాయి. అంటే ఆరు కోట్ల మంది అమెరికా వాసులకు కొవిడ్ సోకింది. ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదైన దేశం కూడా అమెరికానే. ఆ తరువాత మూడు కోట్ల 57 లక్షల పాజిటివ్స్‌తో భారత్ రెండో స్థానంలో ఉంది.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు

జనవరి 1, 2021 కల్లా కరోనా పాజిటివ్స్ 20 మిలియన్లు దాటగా.. ఆ సంఖ్య గతేడాది డిసెంబర్ 13 చివరి కల్లా 50 మిలియన్లకు చేరింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో 2021 డిసెంబర్ 1న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. కొత్త వేరియంట్ కేసులు కూడా ఆ దేశంలో ప్రస్తుతం ప్రతి రోజు వేల సంఖ్యలో బయటపడుతున్నాయి. అయితే ఒమిక్రాన్ మరణాలు తక్కువగానే ఉన్నా.. డెల్టా వైరస్‌తో చనిపోయేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది.
ఇక డెత్ రేట్ కూడా దారుణంగా ఉంది. కరోనాతో అగ్రరాజ్యంలో మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 లక్షల మంది కొవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 15 శాతానికి పైగా అత్యధిక మరణాలు యూఎస్‌లోనే సంభవించడం.. ఆదేశ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!