పాకిస్థాన్ వంచనను మరోసారి యూఎన్ వేదికగా భారత్ ఖండించింది. యూఎన్‌లో భారత దౌత్యవేత్త భావిక మనగలనందన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. పీఓకేలో పాకిస్థాన్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని.. దీన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ద్వంద్వ మాటలు, కపటత్వాన్ని బయటపెట్టారు.
అంతర్జాతీయ వేదికగా భారతదేశంపై నిందలు మోపే ప్రయత్నం చేసిన దాయాది పాకిస్థాన్‌కు భారత దౌత్యవేత్త పర్వతనేని హరీష్ గట్టిగా బుద్ధి చెప్పారు. సొంత ప్రజలను బాంబులతో చంపే దేశం.. తమపై నిందలు వేయడం చాలా విడ్డూరంగా ఉందంటూ తిప్పికొట్టారు.
ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగాన్ని భారత్ తిప్పికొట్టింది. భారత్ దౌత్యవేత్త పెటల్ గహ్లోట్ మాట్లాడుతూ.. అణు బ్లాక్ మెయిల్ ముసుగులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఏ మాత్రం అంగీకరించబోమని తేల్చి చెప్పారు.
గాజా స్వాధీనమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకు వెళ్తోంది. దీంతో ఐడీఎఫ్ భీకరదాడులు చేస్తోంది. తాజా దాడులు మీడియా సంస్థలు లక్ష్యంగా జరుగుతున్నాయని అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో ఖలీస్తానీ ఉగ్రవాది దాడికి యత్నించాడు. అంతేకాకుండా భారత జాతీయ జెండాను చించేసి పడేశాడు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఖలీస్తానీ ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిచింది.
శ్రీలంక నేవీ దుందుడుకుగా ప్రవర్తించింది. భారతీయ మత్స్యకారులపై కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు జాలర్లు తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.