India-Canada: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై అక్కడి ప్రజలు, ప్రతిపక్ష నేతలు తీవ్ర అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. ఇప్పటికే కెనడా ‘హౌసింగ్ సంక్షోభం’లో కూరుకుపోయింది. అక్కడి ప్రజలకు ఉండటానికి ఇళ్లు దొరకని పరిస్థితి ఉంది. మరోవైపు ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్లకు కెనడా స్వర్గధామంగా మారింది. రాజకీయ కారణాల వల్ల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతుగా నిలుస్తున్నారు. దీని కారణంగా కెనడా-ఇండియాల మధ్య దౌత్య వివాదం రగులుతోంది.
ఇదిలా ఉంటే భారత్ వియన్నా కన్వెన్షన్ ను ఉల్లంఘిస్తుందని కెనడా గగ్గోలు పెడుతోంది. అయితే దౌత్య సమానత్వాన్ని కోరుకోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా చెప్పుకోవద్దని భారత్ కెనడాకు సూటిగా సూచించింది. ప్రస్తుతం భారత్, కెనడాల్లో ఇరు వైపుల 21 మంది దౌత్యవేత్తలు ఉన్నారు.
Justin Trudeau: కెనడా, ఇండియాల మధ్య దౌత్య వివాదం తీవ్రమవుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదంగా మారింది. ఇదిలా ఉంటే మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా దౌత్యవేత్తలపై భారత ప్రభుత్వం అణిచివేతతో రెండు దేశాల్లోని లక్షలాది మంది ప్రజల సాధారణ జీవితాన్ని కష్టతరం చేస్తోందని ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం అన్నారు.
India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా దేశాల మధ్య దౌత్యవివాదాన్ని రాజేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించడం, సీనియర్ భారత దౌత్యవేత్తను కెనడా వదిలివెళ్లమని ఆదేశించడంతో భారత్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో మొదలైన కెనడా, ఇండియా వివాదం ఇంకా ముగియడం లేదు. తాజాగా మరోసారి కెనడా, భారత్‌ని కవ్విస్తూ ఆ దేశ ప్రజలకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. కెనడా, భారత్ నుంచి తన 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్న గంటల వ్యవధిలో కెనడా విదేశాంగ శాఖ ఈ సూచనలను చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా తీవ్రవాద ముప్పు ఉన్నందున భారత్ లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కెనడా…
‘‘నవరాత్రి శుభాకాంక్షలు! హిందూ సమాజంలోని సభ్యులకు మరియు ఈ పండుగను జరుపుకుంటున్న వారందరికీ నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో ట్రూడో పోస్ట్ చేశారు.
Justin Trudeau: కెనడా ప్రధాని తన తీరు మార్చుకోవడం లేదు. ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత వ్యతిరేక వైఖరి వీడటం లేదు. ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇందులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు కారణంగా ఇరు దేశాల మధ్య ఎప్పుడూ లేనంతగా దౌత్యవివాదం చెలరేగింది. అయితే ఈ వ్యాఖ్యలకు ఆరోపణలు చూపించాల్సిందిగా ఇండియా కోరితే మాత్రం అటు నుంచి స్పందన రావడం లేదు.
India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా దేశాల మధ్య తీవ్ర వివాదాన్ని రాజేసింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనంతగా అట్టడుగు స్థానానికి వెళ్లాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ వివాదంపై స్పందించాయి. అమెరికా విచారణకు ఇండియా సహకరించాలని కోరింది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. భారత్ అల్టిమేటం ఇవ్వడంతో కెనడా చాలా మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది.
కెనడా భారత్‌తో పరిస్థితిని పెంచడానికి చూడటం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం అన్నారు. కెనడా భారత్‌తో బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు.