కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో బ్రిటీష్ కొలంబియాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు భారత్‌కు సంబంధం ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆరోపించిన వారం రోజుల తర్వాత సోమవారం కెనడాలోని ప్రధాన నగరాల్లోని భారత దౌత్య కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయాలని ఖలిస్థానీ గ్రూప్ తన సభ్యులకు పిలుపునిచ్చింది.
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్కూస్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. గత వారం చండీగఢ్, అమృత్‌సర్‌లోని పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.