India Bangladesh: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం విర్రవీగుతోంది. భారత్‌ని ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న మిగతా నేతలు భారత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మహ్ఫజ్ ఆలం ఫేస్బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ విజయ్ దినోత్సవం రోజున ఆలం ఈ పోస్ట్ చేశాడు. ఇదే కాకుండా, భారత్‌లోని పలు ప్రాంతాలను బంగ్లాదేశ్‌లో విలీనం చేసుకుంటామని బెదిరిస్తూ కామెంట్స్…
Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మనెమ్మదిగా పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. ఇండియాతో సంబంధాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడైతే షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిందో అప్పటి నుంచి బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇస్లామిక్ మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
ఇదిలా ఉంటే, బెంగాలీలు అత్యంత పవిత్రంగా భావించే దుర్గాపూజ సమయంలోనే భారత్‌కి బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి పశ్చిమ బెంగాల్‌కి ఎగుమతి అయ్యే ‘‘పద్మ హిల్సా’’ చేపలపై నిషేధం విధించింది. ప్రతీ ఏడాది దుర్గాపూజ సమయంలో హిల్సా చేపలతో విందు చేసుకోవడాన్ని పశ్చిమ బెంగాల్లో సంప్రదాయంగా భావిస్తుంటారు.
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ స్పందించారు. బంగ్లాదేశ్ ఆమెను అప్పగించాలని ఇండియాను కోరే వరకు ఆమె మౌనంగా ఉండాలని కోరారు. ఇది బంగ్లాకు, భారత్‌కి మంచిదని చెప్పారు. భారత్‌తో బంగ్లా బలమైన సంబంధాలకు విలువనిస్తుండగా, ‘‘ అవామీ లీగ్ మినహా ఇతర రాజకీయ పార్టీలను ఇస్లామిక్‌గా చిత్రీకరించి, షేక్ హసీనా లేకుండా బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్‌గా మారుతుందనే కథనాన్ని విడిచి న్యూఢిల్లీ…
India- Bangladesh: ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశాన్ని సందర్శించనున్నారు. భారత్ లో మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత న్యూఢిల్లీకి వచ్చిన మొదటి విదేశీ అతిథి పీఎం హసీనా..