Acharya Pramod Krishnam: కాంగ్రెస్ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కి అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లే, ఆయన ఇండియా కూటమికి ‘‘పిండప్రధానం’’ చేస్తారని కల్కిథామ్ పీఠాధీశ్వర్ ప్రమోద్ కృష్ణం విరుచుకుపడ్డారు.
INDIA Alliance: 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఒకింత బీజేపీని అడ్డుకోగలిగింది . కానీ, అధికారంలోకి రాకుండా ఆపలేకుండా పోయింది. కూటమిగా బీజేపీ వ్యతిరేక పక్షాలు కాస్త సక్సెస్ అయినట్లే కనిపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కించుకోవడం ఊరటనిచ్చే అంశం. కాంగ్రెస్ గత వైభవాన్ని దక్కించుకుంటుందని అంతా రాజకీయ విశ్లేషకులు, మీడియా కథనాలు అంచనా వేశాయి. తీరా.. షరా మమూలే అన్న రీతిలో కాంగ్రెస్ పరాజయాలు…
Arvind Kejriwal: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఇండియా కూటమిలో లుకలుకలకు కారణమవుతోంది. ఇతర మిత్ర పక్షాలు కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ పార్లమెంట్‌లో కాంగ్రెస్ విధానంపై మండిపడుతోంది. సభని సరిగా జరగనివ్వాలని కోరుతోంది.
Hemant Soren: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈరోజు ( గురువారం) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
INDIA alliance: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి సంచలన విజయాన్ని సాధించింది. మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుత విజయం తర్వాత జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 26న జరగనుంది.
Maharashtra Election Results: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సునామీ సృష్టిస్తోంది. మహారాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఫలితాలు సాధిస్తోంది. మొత్తం 288 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఏకంగా 218 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. సొంతగా బీజేపీ 124 స్థానాల్లో, షిండే సేన 55 స్థానాలు, అజిత్ పవార్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కేవలం 58 స్థానాల్లో…
Election Results: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తుండగా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం హోరాహోరీని తలపిస్తున్నాయి. క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతోంది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ 41. అయితే, బీజేపీ కూటమి, జేఎంఎం+ కాంగ్రెస్ కూటమి మధ్య లీడ్ మారుతోంది.
Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోంది. ఈ రోజు మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో ఇరు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఎర్లీ ట్రెండ్స్ నుంచి బీజేపీ కూటమి రెండు రాష్ట్రాల్లోనూ లీడింగ్‌లో ఉంది. తాజాగా ఆధిక్యంలో బీజేపీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. మహారాష్ట్రలో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నప్పటికీ.. జార్ఖండ్‌లో ఆధిక్యం బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య చేతులు మారుతోంది. Read Also: Virender Sehwag: ఆర్యవీర్.. తృటిలో ఫెరీరా కారు…
Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లో ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ కూటమి దూసుకుపోతోంది. బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు సీట్ల సంఖ్య ప్రత్యర్థి పార్టీల కన్నా ఎక్కువగా ఉంది.