IND vs SA: సూర్యకుమార్ మెరుపు సెంచరీ.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం! సిరీస్ సమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India beat South Africa in 3rd T20I: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (100; 56 బంతుల్లో 7×4, 8×6) మెరుపు సెంచరీకి తోడు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/17) మయాజాలం తోడవడంతో భారత్ సునాయాస విజయం అందుకుంది. ఈ విజయంతో భారత్ పొట్టి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుకుపోగా.. రెండో మ్యాచ్‌లో ప్రొటీస్ గెలిచింది. ఇక భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 17 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (60; 41 బంతుల్లో 6×4, 3×6) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (8), తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (0) నిరాశపరిచారు. మూడో ఓవర్లో కేశవ్ మహరాజ్.. గిల్, తిలక్‌లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. ఈ సమయంలో జైస్వాల్‌కు సూర్యకుమార్ యాదవ్ తోడయ్యాడు. జైస్వాల్ దూకుడుగా ఆడినా.. సూర్య నెమ్మదిగా ఆడాడు. తానెదుర్కొన్న తొలి 24 బంతుల్లో 26 పరుగులే చేశాడు. దాంతో భారత్ 10 ఓవర్లకు 87/2 రన్స్ చేసింది. ఆపై సూర్య గేర్ మార్చి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు రింకు సింగ్ (14) తన మార్క్ షాట్స్ ఆడలేదు.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
రెండో మ్యాచ్‌లో తేలిపోయిన భారత బౌలర్లు కీలక మ్యాచ్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఛేదనలో క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచారు. రెండో ఓవర్లో బ్రీజ్కె (8)ను ముకేశ్ బౌల్డ్ చేయగా.. ఆపై సిరాజ్ త్రోకు హెండ్రిక్స్ (8) రనౌటయ్యాడు. ప్రమాదకర బ్యాటర్ క్లాసెన్ (5)ను అర్ష్‌దీప్ ఔట్ చేశాడు. మార్‌క్రమ్ (25)ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ఓ వైపు మిల్లర్ (35) నిలిచినా మరో వైపు నుంచి భారత్ వికెట్ల వేట కొనసాగిస్తూ పోయింది. కుల్దీప్ వరుస విరామాల్లో వికెట్స్ తీస్తూ దక్షిణాఫ్రికాకు చెక్ పెట్టాడు. కుల్దీప్ ధాటికి దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!