Suryakumar Yadav: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Breaks Virat Kohli Record: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో సూర్య ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 8 సిక్స్‌లు బాదిన సూర్య.. టీ20ల్లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. సూర్య 57 ఇన్నింగ్స్‌ల్లో 123 సిక్స్‌లు బాదాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్‌లో ఉన్నాడు. రోహిత్ 140 ఇన్నింగ్స్‌ల్లో 182 సిక్స్‌లు కొట్టాడు. విరాట్ కోహ్లీ 107 ఇన్నింగ్స్‌ల్లో 117 సిక్స్‌లు బాది మూడో స్థానంలో ఉన్నాడు. మూడో టీ20కి ముందు విరాట్ రికార్డును బద్దలు కొట్టడానికి సూర్యకు మూడు సిక్సర్లు అవసరం కాగా.. ఏకంగా 8 సిక్స్‌లు బాదాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్ రోహితే. మార్టిన్ గుప్తిల్ (173) మినహా ఎవరూ కూడా రోహిత్ దరిదాపుల్లో లేరు.
Also Read
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
Also Read: Suryakumar Yadav: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!
టీ20ల్లో కెప్టెన్‌గా సెంచరీ బాదిన రెండో భారత సారథిగా కూడా సూర్యకుమార్ యాదవ్ రికార్డుల్లో నిలిచాడు. రోహిత్ శర్మ రెండు సార్లు కెప్టెన్‌గా శతకాలు నమోదు చేశాడు. ఇక టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో సూర్య (4) మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (4), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (4) సూర్య కంటే ముందున్నారు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా నాలుగు సెంచరీలు బాదిన బ్యాటర్‌గా సూర్య రికార్డుల్లోకెక్కాడు.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!