కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య మరికొద్దిసేపట్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేవని రోహిత్ చెప్పాడు. పిచ్ ప్లాట్‌గా ఉందని, దాన్ని మా ముగ్గురు సీమర్లు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామన్నాడు. తొలి టెస్టులో సరైన ఆరంభం దక్కలేదని, ఈ టెస్ట్ కోసం బాగా సన్నద్ధం అయ్యామని రోహిత్ చెప్పుకొచ్చాడు. గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో ఉదయం 9 గంటలకు పడాల్సిన…
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు కాస్త ఆలస్యంగా ఆరంభం కానుంది. వర్షం కారణంగా గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో.. ఉదయం 9 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యమయింది. మైదానాన్ని పరిశీలించిన ఫీల్డ్ అంపైర్లు.. టాస్ 10 గంటలకు ఉంటుందని, మ్యాచ్ 10.30కు ప్రారంభమవుతుందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ఆరంభం కావాల్సింది. కాన్పూర్ టెస్టుకు వర్షం అంతరాయం కలిగించొచ్చని వాతావరణ శాఖ ముందే చెప్పింది. వర్షం…
నేటి నుంచి ఆరంభమయ్యే చివరిదైన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొంటుంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్వదేశంలో రికార్డు స్థాయిలో 18వ టెస్టు సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా.. కాన్పూర్‌లోనూ బంగ్లాను చిత్తు చేయాలని చూస్తోంది. మంచి ఫామ్ మీదున్న రోహిత్ సేనను ఆపడం బంగ్లాకు పెను సవాలే. తొలి టెస్టులో దెబ్బతిన్న బంగ్లాదేశ్ పుంజుకోవాలని భావిస్తోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధ శతకంతో రాణించాడు. గిల్…
IND Playing 11 vs BAN For 2nd Test: బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాను ఏకంగా 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అదే ఊపులో కాన్పూర్ వేదికగా శుక్రవారం ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ గెలిచి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన చూస్తోంది. అంతేకాదు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని లక్ష్యంతో రెడీ అవుతోంది.…
Ravichandran Ashwin 6 Can Break 6 Records In Kanpur Test: బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. చెన్నైలో జరిగిన మొదటి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. మరో కీలక పోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. కాన్పూర్ టెస్ట్‌లోనూ గెలిచి.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చెన్నైలో చెలరేగిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. కాన్పూర్‌లోనూ సత్తాచాటాలని చూస్తున్నాడు.…
Kanpur Pitch Report for India vs Bangladesh 2nd Test: సాధారణంగా చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంటుంది. స్పిన్నర్లు చెపాక్‌లో పండగ చేసుకుంటారు. అయితే భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో మాత్రం బంతి బాగా బౌన్స్ అయింది. ఎన్నడూ లేనివిధంగా పేసర్లు ప్రమాదకరంగా మారారు. తొలి రెండు రోజులు పేసర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు పెను సవాలుగా మారింది. ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం ఆలస్యంగా మొదలైంది. చెన్నైలో పేసర్లు అంత జోరు…