IND Vs AUS 3rd T20: హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఒకే ఏడాది టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఈ ఏడాది భారత్ 21 టీ20ల్లో గెలిచింది. ఈ మ్యాచ్‌లో 187 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. ఓపెనర్లు రాహుల్ (1), రోహిత్ (17) ఇద్దరూ నిరాశపరిచినా విరాట్ కోహ్లీ (63), సూర్యకుమార్ యాదవ్ (69)…
IND Vs AUS 3rd T20: హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ముందు భారీ స్కోరు నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి 5 ఓవర్లు, చివరి 5 ఓవర్లలో చెలరేగి ఆడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది. ఓపెనర్ కామెరూన్ గ్రీన్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అతడు మొత్తం 52…
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్‌ను తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. నేటి మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్‌ను డిసైడ్ చేసే నిర్ణయాత్మక మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్‌ను తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. నేటి మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం…
ఈరోజు ఉప్పల్ వేదికగా జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ యాప్‌లో బెట్టింగ్‌లను ముఠా నిర్వహిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇండియా గెలుస్తుందని భారీ స్థాయిలో బెట్టింగ్‌లు పెడుతున్నారని.. ఆసీస్ గెలుస్తుందని రూ.వెయ్యికి రూ.4వేలు బెట్టింగ్ నడుస్తోందని.. ఇండియా టాస్ గెలుస్తుందని బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అటు బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్న 12 మందిని ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad Cricket Association: కొన్నిరోజులుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వార్తల్లో మెయిన్ టాపిక్ అవుతోంది. భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20కి సంబంధించి టిక్కెట్ల అమ్మకాలలో అక్రమాలకు పాల్పడిందంటూ ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విమర్శల పాలైంది. అయితే తాజాగా టిక్కెట్లకు సంబంధించి మరో తప్పిదం చేసిందని హెచ్‌సీఏపై అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. టిక్కెట్లపై మ్యాచ్ టైమింగ్ తప్పుగా ముద్రించిందని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. టాస్ సాయంత్రం 6:30 గంటలకే వేస్తారు. కానీ…
IND Vs AUS: ఆదివారం నాడు హైదరాబాద్‌లో కీలక మ్యాచ్ జరగనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి టీ20 కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ సందర్భంగా తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. అయినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. శంషాబాద్ చేరుకున్న అనంతరం టీమిండియా, ఆస్ట్రేలియా టీమ్‌ల…
Team India: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం నాడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించగా.. నాగపూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో హైదరాబాద్‌లో జరిగే టీ20లో ఎవరు గెలిస్తే వాళ్లు సిరీస్ కైవసం చేసుకుంటారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే చరిత్ర సృష్టించనుంది. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక…