Rohit Sharma Record: నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మొత్తం నాలుగు సిక్సర్లు కొట్టాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. దీంతో అతడు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల (173) రికార్డును చెరిపేశాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 176 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో మార్టిన్ గప్తిల్ (173),…
IND Vs AUS: నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా చెలరేగిపోయింది. 91 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 4 బంతులు ఉండగానే ఛేదించి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ రాహుల్ (10) నిరాశపరిచాడు. విరాట్ కోహ్లీ 11 పరుగులకు అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 9…
IND Vs AUS: నాగపూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. గురువారం కురిసిన వర్షానికి మైదానం చిత్తడిగా మారడంతో పిచ్‌ను డ్రై చేయడంలో ఆలస్యమైంది. దీంతో రెండు జట్ల కెప్టెన్లతో సంప్రదింపుల అనంతరం మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ప్రారంభం అవుతుందని అంపైర్లు ప్రకటించారు. కేవలం 8 ఓవర్ల మ్యాచ్ కావడంతో ఇరు జట్లలో హిట్టర్లు చెలరేగే అవకాశం…
IND Vs AUS: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నాగపూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యం కానుంది. నాగపూర్‌లో ప్రస్తుతం వర్షం కురవకపోయినా.. గత రాత్రి భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. దీంతో అవుట్ ఫీల్డ్‌తో పాటు పిచ్ చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టాస్ కూడా వేయలేదు. పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. అవుట్ ఫీల్డ్‌లో ఒకట్రెండు చోట్ల తేమ శాతం అధికంగా ఉంది.…
Rahul Dravid: ఆసియా కప్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన భారత అభిమానులకు కలవరపరుస్తోంది. ముఖ్యంగా టీమ్ పేలవమైన బౌలింగ్ ప్రదర్శనతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో రాబోయే టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని టీమ్‌కు మరిన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు, వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించడం మేలని కోచ్ రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నాడు. ఈ మేరకు ఆస్ట్రేలియాలో ఎక్కువ వార్మప్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐని కోరాడు. ద్రవిడ్ విజ్ఞప్తితో పాటు అభిమానుల…
టికెట్లు దొరకకపోవడంతో పాటు తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటకు కారణం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే కారణమని గాయపడిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అజారుద్దీన్ సహా హెచ్‌సీఏ నిర్వాహకులపై మూడు కేసులు నమోదయ్యాయి.
Team India: మొహాలీలో జరిగిన తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక టీమిండియా చేతులెత్తేసింది. దీంతో భారత్ ఖాతాలో మరో ఓటమి చేరింది. గత నాలుగు టీ20లలో భారత్‌కు ఇది మూడో పరాజయం కావడం గమనించాల్సిన విషయం. అంతేకాకుండా తాజా ఓటమితో స్వదేశంలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు టీ20 మ్యాచ్‌లలో 200 ప్లస్ టార్గెట్‌లను డిఫెండ్ చేసుకోవడంలో విఫలమైన తొలి జట్టుగా టీమిండియా చెత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది జూన్ నెలలో…
Team India: ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన తొలి టీ20 చూసిన తర్వాత టీమిండియా అభిమానులందరూ ఓ అంచనాకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్ గెలిచేంత సీన్ అయితే లేదని పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు టీ20ల్లో మన జట్టే తోపు అన్న ఫీలింగ్‌లో ఉన్న అభిమానులే ఇప్పుడు తమ మనసు మార్చుకున్నారు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా ఉన్న మన జట్టు గురించి అంచనాలు పెట్టుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. కానీ…