హిందూ సంప్రదాయంలో అనేక నమ్మకాలు ఉన్నాయి. అలాంటిదే తుమ్ములపై కూడా ప్రజల్లో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. చాలా మంది తుమ్ములను అశుభంగా భావిస్తారు. ప్రత్యేకించి ఏదైనా శుభకార్యాలు జరుపుతున్నప్పుడు.. ఎవరైనా తుమ్మితే అది చాలా అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఎక్కడికైనా వెళ్లే ముందు తుమ్మితే ఆగిపోయి, కొంత సమయం తర్వాత నీళ్లు తాగి బయటకు వెళ్లమని పెద్దలు చెబుతుంటారు.