పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని నిషేధిత ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ రహస్య నివేదిక వెల్లడించింది. దేశంలోని ఇతర ప్రముఖ రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు రహస్య నివేదికలో పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్, అంతర్గత మంత్రి రాణా సనావుల్లాను కూడా దేశంలో శాంతికి విఘాతం కలిగించడానికి శత్రు శక్తులు లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదిక వెల్లడించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ బహిరంగ ర్యాలీలు లేదా ఉద్యమాల సమయంలో ఇమ్రాన్ ఖాన్‌పై దాడి చేయవచ్చు అని హెచ్చరించింది.
Also Read:Shooting at Texas : హైస్కూల్ ప్రాం పార్టీలో ఫైరింగ్.. 9 మందికి తీవ్ర గాయాలు
తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), విదేశీ ప్రాయోజిత నిషేధిత సంస్థలు పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపింది. ఇమ్రాన్ ఖాన్, రాణా సనావుల్లా, ఖవాజా ఆసిఫ్‌లతో సహా ప్రముఖ రాజకీయ నేతలపై తీవ్రవాద దాడులు జరుగుతాయని రెండు ప్రావిన్సులలో ఎన్నికలకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన రహస్య నివేదికలో భయాన్ని వ్యక్తం చేసింది. PTI చీఫ్‌ని తన ఉద్యమం సమయంలో లేదా బహిరంగ ర్యాలీలో లక్ష్యంగా చేసుకోవచ్చు, అదే సమయంలో మతపరమైన తీవ్రవాదులు కూడా ఆయనను లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదిక పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ భద్రతా సిబ్బందిని నిశితంగా పరిశీలించాలని సున్నితమైన ఏజెన్సీలను కోరింది.