పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద అక్కడి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి పెడుతుంది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీయులు ఇచ్చిన బహుమతుల అమ్మకం కేసులో జైలుకు పంపారు. అయితే ఆయన పార్టీని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, తాజాగా ఇమ్రాన్ ఖాన్ సైతం అలాంటి ఆరోపణలు చేశారు. అయితే పార్టీ రద్దు చేసుకుంటే చేసుకొమ్మంటూ ఆయన సవాలు చేశారు. ఆ పార్టీ పోతే తాను ఇంకో పార్టీ పెడతానని చెప్పాడు. కొత్తగా పెట్టిన పార్టీతో అధికారం చేపడతామని ఇమ్రాన్ ధీమా వ్యక్తం చేశాడు.
Read Also: Vaishnavi Chaitanya: ప్రాణం పెట్టి చేశా.. కొంచెం మీటర్ తప్పినా ఇక అంతే!
మే 9న ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాకిస్థాన్ లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లపై పూర్తి బాధ్యత ఇమ్రాన్ పార్టీపై వేసే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణులు వస్తున్నాయి. అయితే, పాక్ ప్రభుత్వం దీనిని బూచీగా చూపిస్తూ.. పీటీఐ పార్టీ నేతలపై ఐటీ దాడులు, కేసులు వేయడం లాంటివి చేస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు పీటీఐ నేతలు అరెస్ట్ అయ్యారు. అందులో కొంత మంది జైల్ నుంచి రిలీజ్ అయ్యారు. కొందరు ఇంకా శిక్ష అనుభవిస్తునే ఉన్నారు. ఈ అల్లర్లను ఆధారం చేసుకునే పీటీఐని రద్దు చేయాలని అధికార పార్టీలోని కొందరు ప్లాన్ చేస్తున్నారు.
Read Also: PM Modi: బుర్జ్ ఖలీఫాపై భారత ప్రధాని మోడీ ఫోటో
అయితే, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనాఉల్లా రియాక్ట్ అయ్యారు. దేశంలో మామూలు పరిస్థితి రావాలంటే పీటీఐని రద్దు చేయడమే ఏకైక మార్గమన్నారు. ఇదే విషయాన్ని రక్షణ శాఖ మంత్రి కూడా చెప్పారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ బుట్టో సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా, వీరి వ్యాఖ్యలపై ఇమ్రాన్ స్పందిస్తూ ‘‘వాళ్లు మా పార్టీని రద్దు చేస్తే చేయనీయండి. కొత్త పార్టీ పేరు మీద గెలుస్తాం అని అన్నారు. పోటీ చేయకుండా నాపై నిషేధం విధించినా, నన్ను జైల్లో వేసినా, మా పార్టీ గెలుస్తుందని ఇమ్రాన్ తెలిపారు.