సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. రేపోమాపో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రానుందనే ప్రచారం నేపథ్యంలో కేబినెట్ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అంతేకాకుండా.. మహిళలకు వడ్డీలేని రుణాలతో పాటు, మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఆర్థిక సహాయంపై చర్చించే అవకాశముంది.