నేడు ఏపీ హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది.. సినీ హీరో అల్లు అర్జున్ పిటిషన్ సహా.. ముంబై నటి జత్వాని కేసు సహా పలు పిటిషన్లు విచారణకు రానున్నాయి.. ఏపీ హైకోర్టులో హీరో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని పిటిషన్ వేశారు అల్లు అర్జున్.. ఇక, ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు ఓ కీలక కేసులో తీర్పు వెలువరించడంతో పాటు.. పలు కీలక పిటిషన్లపై విచారణ చేపట్టనుంది.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో నేడు తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు..