Cervical Cancer Vaccination: మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ని ఎదుర్కొనే లక్ష్యంతో కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో 9-14 ఏళ్ల బాలికలకు హ్యుమన్ పాపిల్లోమావైరస్ (HPV) టీకా ప్రచారాన్ని ప్రారంభించనుంది. సర్వైకల్ క్యాన్సర్‌ని అడ్డుకునే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇమ్యూనైజేషన్ డ్రైవ్ ప్రారంభించనున్నారు. మూడు దశల్లో ఈ కార్యక్రమం ఉండనుంది. ప్రారంభ దశ కోసం 7 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని సిద్ధం చేశారు. కేంద్రం ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.