ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా వుండాలని సూచించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోందని, ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించింది. క్రమేపీ అది బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని, దీని…
వరుస వరదలతో ఉత్తరాఖండ్ విలవిలలాడుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో అక్కడి జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. రాష్ట్రంలోని నైనితాల్ నదీ ఉగ్రరూపం కారణంగా 30 మంది మరణించారు. చంపావత్ నదీ ప్రవాహం…
ఉత్తరాఖండ్ కు మరో ముప్పు పొంచి ఉన్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈరోజు నుంచి ఆ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉండటంతో దిగువ ప్రాంతంలోని ప్రజలను తరలించారు. అంతేకాదు, బద్రీనాథ్ యాత్రను…
ఇటీవల వచ్చిన గులాబ్ తుఫాన్ నుంచి ఇంకా కోలుకోలేదు. తీరప్రాంతంలోని గ్రామాలు అనేకం ఇంకా ముంపులోనే ఉన్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీటిపాలైంది. దీంతో అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. చేపల వేటకు వెళ్లే విషయమై మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గులాబ్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటిమట్టం పెరిగింది. ఈ గులాబ్ తుఫాన్ నుంచి ఇంకా కోలుకోక ముందే…
తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించిన గులాబ్ తుఫాన్ గురించి పూర్తిగా మర్చిపోకముందే మరో తుఫాను విజృంభించడానికి రెడీ అవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఈ తుఫాను ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళే ఈ తుఫాను ఏర్పడుతుందని ఐఎండీ అభిప్రాపయపడుతోంది. దీనికి ‘సైక్లోన్ షహీన్ అని పేరు పెట్టారు. ఈ పేరును కతార్ సూచించింది. ఈ తుఫాను భారత్‌పై పెద్దగా ప్రభావం చూపించబోదని పరిశోధకులు చెప్తున్నారు. ఇది పాకిస్థాన్ వైపు వెళ్లనుందని వివరించారు. అయితే భారీ…
దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురిసాయి.. కుండపోత వర్షం దెబ్బకు వీధులు, రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఈ రోజు ఉదయం 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.. 13 ఏళ్లలో ఆగస్ట్ నెలలో ఒకే రోజు అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఈ భారీ వర్షంతో దేశ రాజధానిలో ఆరెంజ్ హెచ్చరిక జారీ…
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కోత్రా గ్రామంలో కొంత మంది ఇంటి పైకప్పుపై ఉన్నారనే సమాచారంతో.. వారిని తీసుకొచ్చేందుకు మంత్రి నరోత్తమ్ మిశ్రా.. బోటుపై అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో బోటుకు అడ్డుగా చెట్టుకూలిపోవడంతో.. ఆయన చిక్కుకుపోయారు. ఈ సమయంలో తమను రక్షించాలంటూ అధికారులకు మెసేజ్‌లు పెట్టారు.…
తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు వర్షాలు దంచికొట్టాయి.. మరికొన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురిశాయి.. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది.. ఈ తరుణంలో.. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయంటూ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణశాఖ (ఐఎండీ).. ఈ రోజు, రేపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ రానున్న మూడు…
మే నెల అంటేనే భానుడు ప్రతాపానికి పెట్టింది పేరు.. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి.. ఈ సమయంలో.. వడదెబ్బతో మృతిచెందేవారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.. కానీ, ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది..ఎండలు దంచికొట్టే మే నెలలో వర్షాలు కురిసాయి.. అది ఎంతలా అంటే.. ఏకంగా 121 ఏళ్ల రికార్డుకు చేరువయ్యేలా.. ఈ ఏడాది మే నెలలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ (ఐంఎడీ) తన నివేదికలో పేర్కొంది.. వెంట వెంటనే వచ్చిన…
మహారాష్ట్రలో తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ముంబైలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది భారత వాతావరణవాఖ.. నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే రెండు రోజుల ముందే రావడంతో ముంబైలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గడ్ లకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది… ఈ విషయాన్ని ఐఎండీ ముంబై…