వేసవికాలం మండుతోంది. సూరీడు ఉదయం నుంచి ప్రచండంగా మారుతున్నాడు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత పెరుగుతూనే వుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి..మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు..ఒకవైపు 45 డిగ్రీలు దాటిన ఎండలు మరో వైపు ఉక్కపోత,వడగాలులతో ఉక్కిబిక్కిరౌతున్నారు..రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ లో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. రెండు మూడు రోజులుగా జైనాథ్ ,బేలామండలాల్లో 45 డిగ్రీలుదాటి నమోదు అవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలతో…
ఓ వైపు తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించగా.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని.. అవసరం అయితేనే బయటకు రండి అంటూ ఐఎండీ హెచ్చరించింది. ఐఎండీ సూచలన ప్రకారం రాబోవు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ సమయంలో.. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని.. డీహైడ్రేట్ కాకుండా…
ఏపీకి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుభవార్త అందించింది. ఏటా జూన్ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని చెప్పిన ఐఎండీ.. ఏపీలో మాత్రం సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని తెలిపింది. గడిచిన మూడేళ్లుగా ఏపీలో అటు నైరుతి, ఇటు ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలే పడుతున్నాయి. ఫలితంగా పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే…
మార్చిలోనే ఎండల తీవ్రత ప్రారంభమైంది.. ఏప్రిల్ నెల ఆరంభంలోనూ ఎండలు దంచికొడుతున్నాయి.. తెలంగాణ లోని చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదు అవుతున్నాయి.. ఇక, ఎండలు, ఉక్కుపోతతో అల్లాడిపోతున్న ప్రజలు.. మధ్యాహ్న సమయంలో అవసరం అయితేనే బయటకు రండి అంటూ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నాయి.. ఎండల తీవ్రత కారణంగా.. ఒంటి పూట బడల సమయాన్ని కూడా ఉదయం 11.30 వరకే కుదించిన విషయం తెలిసిందే కాగా.. అందరికీ ఉపశమనం కలిగించేలా చల్లని కబురు…
మునుపెన్నడూ లేని విధంగా సూరీడు మండిపోతున్నాడు. ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రంగా వుంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇవాళ్టి నుంచి 4 రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత నెలలో 122 ఏళ్ల ఉష్ణోగ్రతల రికార్డు బద్దలయ్యాయి. ఈ నెలలో తొలి 10-15 రోజులు ఎండలు మండిపోయే అవకాశం ఉందని, ఆదివారం నుంచి బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. హిమాలయ పర్వతాల్లోనూ ఈసారి ఉన్నట్టుండి…
పర్యావరణ పరంగా తీవ్ర వత్తిడులు కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు, విపరీతమయిన చలి.. వీటికితోడు మండే ఎండలు. ఆరోగ్యంపై, జంతుజాలంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో సూరీడు తన ప్రతాపం చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులిటిన్ ప్రకారం ఈ వేసవిలో ఉత్తర కోస్తా ఎండలతో అదిరిపోవడం ఖాయం అంటున్నారు. రాయలసీమతోపాటు మిగిలిన కోస్తా ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. మార్చి, ఏప్రిల్, మే.. ఈ…
పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.. తెలంగాణలో అయితే, ఏకంగా వడగళ్ల వానలు ఆందోళన కలిగిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా వర్షాలు కురుస్తుండగా.. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తరుగా వర్షం పడుతోంది.. మరోవైపు.. జనగామ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.. జిల్లాలోని బచ్చన్నపేట నర్మెట్ట మండలంలో రాళ్ల వర్షం కురిసింది.. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరికలు…
దేశంలో చలిగాలులు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో 3.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజులపాటు ఇలాంటి పరిస్థితులే ఉంటాయిని వాతావరణ శాఖ హెచ్చరించింది. Read: ఇలాంటి లైఫ్…
ఏపీలో మరోసారి భారీ వర్షాలు పడతాయా? నిన్న నైరుతి బంగాళా ఖాతం , పరిసర ప్రాంతమైన ఆగ్నేయ బంగాళా ఖాతం ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతి బంగాళా ఖాతం దక్షిణ శ్రీలంక తీరానికి దగ్గర్లో సగటు సముద్ర మట్టానికి 3 .1 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించి వుంది. పై ఉపరితల ఆవర్తనమునకు అనుభందముగా ఉపరితలద్రోణి నైరుతి బంగాళా ఖాతంనుండి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోనైరుతి బంగాళా ఖాతంమీటర్లు ఎత్తులో విస్తరించి…
తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదలతో జనజీవనం స్తంభించింది. వర్షప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో భారీనుంచి అతి భారీ వర్షాలు కురి సే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్11 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిం చింది. ఒక వేళ ఇప్పటికే ఎవరైనా చేపల వేటకు వెళ్లి ఉంటే వారిని వెంటనే వెనక్కి తిరిగి రావాలని…