మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో 38-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయని.. ఎండలు కొద్ది కొద్దిగా తగ్గుతాయనీ ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
బిపోర్‌జోయ్ తుఫాన్ ఉత్తర-ఈశాన్యల వైపు పయనిస్తున్నందున మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు-మధ్య అరేబియా సముద్రం వద్ద తీవ్రరూపం దాల్చింది.
రుతుపవనాల ఎంట్రీతో కేరళ తీరంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు విస్తరించిన రుతుపువనాలు 48 గంటల్లో కేరళలోని అన్ని ప్రాంతాలకు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. మరో వారం-10 రోజుల్లో తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉంది.
అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని భారత వాతావరణశాఖ ఇవాళ (గురువారం) వెల్లడించింది. ఈ తుపాన్ ప్రభావంతో కేరళలో రేపటి నుంచి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.
Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగనమనం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ మొదటివారంలోనే రుతుపవానాలు కేరళ తీరాన్ని తాకాలి. అయితే ఇప్పటి వరకు కేరళను చేరుకోలేదు. జూన్ 4న రెండు రోజులు ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని ముందుగా భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. అయితే అరేబియా సముద్రంలో ‘బిపోర్జాయ్’ తుఫాన్ ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Delhi: దేశ రాజధాని ఢిల్లీ తడిసిముద్దవుతోంది. మంగళవారం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుతలో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. ఢిల్లీకి రావాల్సిన అనేక విమానాలను దారి మళ్లించారు. మంగళవారం ఢిల్లీకి రావాల్సిన 10 విమానాల్లో 9 విమానాలను జైపూర్ కు, ఒకదాన్ని లక్నోకు దారి మళ్లించారు.