అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని భారత వాతావరణశాఖ ఇవాళ (గురువారం) వెల్లడించింది. ఈ తుపాన్ ప్రభావంతో కేరళలో రేపటి నుంచి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. అత్యంత తీవ్రమైన తుపాన్ మరింత బలపడి రానున్న మూడు రోజుల్లో ఉత్తర దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొనింది.
Also Read : Odisha Train Accident: ఒకరి కొడుకు మృతదేహాం మరొకరికి అప్పగింత.. ఓ తండ్రి ఆవేదన
భారతదేశం, ఒమన్, ఇరాన్, పాకిస్తాన్‌తో సహా అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న దేశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది మాత్రం ఇంకా అంచనా వేయలేదు. జూన్ 12వ తేదీ వరకు ఈ తుపాన్ తీవ్రత మరింత పెరుగుతోంది అని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. వాతావరణ మార్పుల కారణంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో తుపాన్లు బలపడుతున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు.
Also Read : WTC Final Match Day-1: ఆసీస్ దే ఫస్ట్ డే.. తేలిపోయిన భారత బౌలర్లు..
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపాను, అల్పపీడనం ప్రభావంతో దక్షిణ ద్వీపకల్పంలో వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త తెలిపారు. తుఫాను తీవ్రత క్షీణించిన తర్వాత దక్షిణ ద్వీపకల్పం దాటి రుతుపవనాల పురోగతి సాగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.