దేశంలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది.
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో 24 గంటల వ్యవధిలో 115.5 మిల్లీమీటర్లకు మించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
మధ్యప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నప్పటికీ, మంగళవారం ఉదయం వరకు మధ్యప్రదేశ్‌లోని పలు ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది.
భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత 5 రోజులుగా వర్షాలు కురుస్తాయని.. భారత వాతావరణశాఖ హెచ్చరించిన కొన్ని గంటలకే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైతో పాటూ.. పుణె, నాగపూర్‌లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 మధ్య.. కేవలం 3 గంటల్లో ముంబైలో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, బీహార్‌తో సహా పలు రాష్ట్రాల్లోకి త్వరలో ప్రవేశించనున్నాయి.
బిపర్‌జోయ్ తుఫాన్ మరో 2 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ శుక్రవారం రాత్రి 11:30 గంటలకు ఆగ్నేయ పాకిస్థాన్ మీదుగా డీప్ డిప్రెషన్ గా బలహీనపడింది.
Cyclone Biparjoy: గుజరాత్ తీరాన్ని ముంచెత్తడానికి ‘బిపార్జాయ్’ తుఫాన్ ముంచుకొస్తుంది. మరికొన్ని గంటల్లలో గుజరాత్ తీరాన్ని తాకనుంది. ఇదిలా ఉంటే తుఫాన్ వస్తుందనే ముంచుకొస్తుందనే సూచనలు వెలువడుతున్నాయి.
Heat Wave: అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాన్ ‘బిపార్జాయ్’ గుజరాత్ తీరంపై విరుచుకుపడేందుకు చూస్తోంది. రేపు గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. గుజరాత్ తో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ గోవాల రాష్ట్రాలతో పాటు డామన్ డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హావేలీ కేంద్ర పాలిత ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించింది భారతవాతావరణ శాఖ(ఐఎండీ).
బిపర్ జోయ్ తుఫాను నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు బిపర్ జోయ్ తుఫాన్ హెచ్చరికలతో రెడ్ అలర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది.