Hyderabad Rains : హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురా ప్రాంతాల్లో వరుణుడు దంచికొడుతున్నాడు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు నగరంలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు ప్రజలకు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
UP: నది ఒడ్డున ప్రేమికుడు, కొండపై ప్రియురాలి మృతదేహాలు.. చంపిందెవరు..?
భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ మోడ్‌లోకి వెళ్లింది. అమీర్‌పేట్, మైత్రివనం వద్ద వాటర్ లాగింగ్ పాయింట్లను హైడ్రా కమీషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షించాలంటూ ప్రభుత్వం అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
Rajat Patidar: హలో! నేను విరాట్ కోహ్లీ.. యువకుడికి స్టార్ క్రికెటర్ల నుంచి కాల్స్..