ఆఫ్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్‌పై పాకిస్థాన్ ఇప్పుడు ఎదురుదాడికి తెరతీసింది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు నవంబర్ 1లోగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని పాకిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ఈ గడువు దాటిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.