Delhi Metro: ఢిల్లీ మెట్రో ముందు దూకి ఆత్మహత్యలు చేసుకునే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఐఐటీకి చెందిన 22 ఏళ్ల విద్యార్థి బ్లూ లైన్ మెట్రో రైలులోని తిలక్ నగర్ స్టేషన్‌లో ఆదివారం దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
IIT Student Suicide: ఐఐటీ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఐఐటీ మద్రాస్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల పుష్పక్ అనే విద్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. తన మరణంపై విచారణ చేయవద్దని సూసైట్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.