పంజాబ్‌లో కరోనా వైరస్ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. చండీగఢ్ రాజధాని సెక్టార్ 32లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి (GMCH)లో ఈ రోజు ఉదయం 35 ఏళ్ల రోగి మృత్యువాత పడ్డాడు. కొన్ని రోజుల క్రితం ఈ రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో లూథియానాలోని సమ్రాలా నుంచి చండీగఢ్‌కు రిఫర్ చేశారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. రోగికి ఇప్పటికే కాలేయంలో గడ్డ ఉందని, ఇతర వ్యాధులతో (కొమొర్బిడ్ పరిస్థితులు) బాధపడ్డాడు. ఒకటి కంటే ఎక్కువ రోగాలు…
గురుగ్రామ్ హాస్పిటల్ ఐసీయూలో ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని బధౌలి గ్రామానికి చెందిన నిందితుడు దీపక్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని ఒక ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఒక మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయడానికి 8 బృందాల సహాయంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది. Also Read:RCB vs PBKS : భారీ…
ఆ తండ్రి.. తన ఇద్దరు కూతుళ్లకు వివాహాలు గ్రాండ్‌గా చేయాలని భావించాడు. అందుకు తగినట్టుగా వివాహ ఏర్పాట్లు చేశాడు. పెళ్లి కార్డులు పంచాడు. బంధువుల్ని పిలిచాడు. ఇంకోవైపు వివాహ ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి.
చైనాతో పాటు ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి హడలెత్తించిన సంగతి తెలిసిందే.. చైనాలో ఈ మహమ్మారి కారణంగా లక్షలాది మంది చనిపోయారు. అదే సమయంలో.. అంటువ్యాధి కారణంగా సంభవించే మరణాల నుండి చైనా గుణపాఠం నేర్చుకుంది. ఈ క్రమంలో.. దేశంలో ఐసియు పడకల సంఖ్యను పెంచాలని చైనాకు చెందిన అనేక ఏజెన్సీలు సోమవారం తెలిపాయి. 2025 నాటికి దేశంలో 100,000 మందికి 15 ఐసీయూ పడకలు, 2027 నాటికి 18 ఉండాలని ఏజెన్సీలు తమ ప్రతిపాదనలో పేర్కొన్నాయి.
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పేషెంట్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నర్సింగ్ స్టాఫ్ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన అల్వార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఐసీయూలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఉపిరితిత్తలు ఇన్ఫెక్షన్ కారణంగా సదరు యువతి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు చిరాగ్ యాదవ్ తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.
ICU Admit: ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ICU)రోగిని చేర్చుకోవడంపై కొత్తగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. రోగి కండీషన్ విషమంగా ఉన్న పరిస్థితుల్లో ఐసీయూలో చేర్చి డాక్టర్లు చికిత్స అందిస్తుంటారు. ఇలా ఐసీయూలో చేరికపై 24 మంది నిపుణులు చర్చించి కొత్తమార్గదర్శకాలను జారీ చేశారు. ఈ కొత్త మార్గదర్శకాల్లో రోగి బంధువుల ఇష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు.
7వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టాడు. దీంతో విద్యార్థి తరగతి గదిలోనే స్పృహతప్పి పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చిన్నారి గుండెలోని మృదు కణజాలంలో గాయం ఉందని వైద్యులు చెబుతున్నారు.
Madonna Hospitalized: అమెరికన్ సింగర్ మడోన్నా అభిమానులకు మింగుడుపడని వార్త. సీరియల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా గత కొన్ని రోజులుగా ఆమె బాధపడుతున్నారు. దీంతో ఆస్పత్రిలోని ICUలో చేరారు.
Taraka Ratna Health : నారా లోకేష్ పాదయాత్రలో నందమూరి హీరో తారకరత్న గుండెపోటు కారణంగా పడిపోయిన విషయం తెలిసిందే. ఆయనకు హాస్పిటల్ లో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తూనే ఉన్నారు.
BCCI: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంపై బీసీసీఐ స్పందించింది. ప్రస్తుతం పంత్ క్షేమంగా ఉన్నాడని, స్పృహలోకి వచ్చాడని పేర్కొంది. పంత్ నుదుటిపై రెండు చోట్ల లోతైన గాయాలు అయ్యాయని, కుడి మొకాలిలో లిగమెంట్ టియర్ వచ్చిందని, కుడి మణికట్టు, బొటనవేలితో పాటు వీపు భాగంలో గాయాలు అయ్యాయని బీసీసీఐ తెలిపింది. పంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందని ప్రకటనలో చెప్పుకొచ్చింది. పంత్ పూర్తిగా కోలుకునే వరకు బోర్డు అండగా ఉంటుందని…