Taraka Ratna Health : నారా లోకేష్ పాదయాత్రలో నందమూరి హీరో తారకరత్న గుండెపోటు కారణంగా పడిపోయిన విషయం తెలిసిందే. ఆయనకు హాస్పిటల్ లో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తూనే ఉన్నారు. తొలుత కుప్పం హాస్పిటల్ కి తరలించగా హార్ట్ ఎటాక్ అని తెలియడంతో… ఫస్ట్ ఎయిడ్ ట్రీట్‌మెంట్ అందించి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయానికి తరలించారు. మూడు రోజుల నుంచి వెంటిలేటర్ పైనే ఉండి చికిత్స పొందుతున్నారు తారకరత్న. తాజా హెల్త్ బులిటెన్ ను కూడా రిలీజ్ చేశారు వైద్యులు.
Read Also: Mountain of cash: గుట్టల కొద్ది డబ్బు.. బ్యాగుల్లో తీసుకెళ్లిన ఉద్యోగులు
తారకరత్నకి ఎలాంటి ఎక్మో సపోర్ట్ ఇవ్వడం లేదని, వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లుగా బులిటెన్ లో వైద్యులు పేర్కొన్నారు. ఇక ఐసియూలో ఉన్న తారకరత్నని చూసేందుకు కుటుంబసభ్యులను కూడా వైద్యులు నిరాకరిస్తున్న సమయంలో తారకరత్నకి సంబంధించిన ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ఈ ఫొటోలో తారకరత్న వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో వెంటిలేటర్ పై అపస్మారక స్థితిలో ఉన్న తారకరత్నని చూసిన అభిమానులు.. తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా తారకరత్న కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదిక తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా తారకరత్న పై ట్వీట్ చేశాడు.
Read Also: Union Budget : నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. పార్లమెంట్లో ప్రసంగించనున్న రాష్ట్రపతి