క్రికెట్ లో రేపటి నుంచి కొత్త రూల్ అమలు కానుంది. స్టాపింగ్ క్లాక్ పేరుతో సరికొత్త నిబంధన తీసుకొచ్చింది ఐసీసీ. ఈ రూల్స్ ప్రకారం బౌలింగ్ జట్టు.. తన తర్వాతి ఓవర్ లోని మొదటి బంతిని మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకండ్ల లోపే వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రూల్ అమలు చేసేందుకు ఓ ఎలక్ట్రానిక్ క్లాక్ ను స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. ఇది 60 నుంచి 0 వరకు కౌంట్ డౌన్ చేస్తుంది. అలా…
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈరోజు (సోమవారం) U19 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 19 నుండి ఫిబ్రవరి 11 వరకు ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇంతకుముందు.. ఈ టోర్నమెంట్ శ్రీలంకలో నిర్వహించేందుకు నిర్ణయించగా.. ఇప్పుడు అక్కడి నుంచి వేదికను తరలించారు. ఈ టోర్నమెంట్ లో.. భారత్, బంగ్లాదేశ్, అమెరికా, వెస్టిండీస్, నమీబియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, నేపాల్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో కలిపి 16 జట్లు…
ICC introduces stop clock to reduce time between overs in men’s cricket: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో వేగాన్ని పెంచేందుకు ప్రయోగాత్మకంగా ‘స్టాప్ క్లాక్’ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఓవర్ పూర్తయిన 60 సెకన్లలో లోపు తర్వాతి ఓవర్‌ను ఆరంభించడంలో ఫీల్డింగ్ జట్టు ఒక ఇన్నింగ్స్‌లో మూడోసారి విఫలమైతే.. ఆ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించబడుతుంది. ఈ స్టాప్ క్లాక్ పురుషుల వన్డే, టీ20 క్రికెట్లో…
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెట్ లో అత్యున్నత స్థాయిలో ఆడకుండా ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లను నిషేధించింది. అంతర్జాతీయ మహిళల ఆట సమగ్రతను, క్రీడాకారుల భద్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐసీసీ తెలిపింది.
శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అండర్ 19 వరల్డ్ కప్ శ్రీలంకలో నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ.. ఇప్పుడు వేదికను మర్చారు. ఈరోజు అహ్మదాబాద్‌లో సమావేశమైన ఐసీసీ బోర్డు.. 2024 అండర్ -19 ప్రపంచ కప్ నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించింది. ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డులో కొనసాగుతున్న గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని ఆతిథ్య బాధ్యతలను దక్షిణాఫ్రికాకు మార్చారు.
ICC Picks Team of the Tournament for ODI World Cup 2023: ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 సందడి ముగిసింది. భారత గడ్డపై అక్టోబరు 5న మొదలైన వరల్డ్‌కప్ పండుగ.. నవంబర్ 19తో ముగిసిపోయింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఆరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన అత్యుత్తమ…
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చివరి దశకి చేరుకుంది. రేపు, ఎల్లుండి సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగనుండగా... ఈ నెల 19వ తేదీన జరిగే ఫైనల్ జరుగనుంది. దీంతో ఈ మెగా టోర్నీ సమాప్తమవుతుంది. అయితే.. సెమీస్, ఫైనల్ మ్యాచ్ ల కోసం ఐసీసీ రిజర్వ్ డేలను కేటాయించింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డేలో నిర్వహించనున్నారు.
Reserve Days for World Cup 2023 Semi-Finals: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే సెమీ ఫైనల్-1 మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనుండగా.. నవంబర్ 16న కోల్‌కతాలో జరిగే సెమీ ఫైనల్-2లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‌ల కోసం నాలుగు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సెమీస్ మ్యాచ్‌లకు వర్షం…
Sri Lanka Cricket suspended by ICC: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శనకు గాను శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ విధించింది. ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా ఎస్ఎల్సీ పాలనలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నందుకు శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకుంది. ఈ…
ఐసీసీ ప్రతి నెలా ప్రకటించే ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం పోటీ పడే వారిలో ఈ వరల్డ్‌కప్‌లో ఆడే ఆటగాళ్లు ఉన్నారు. అక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా ఇండియా తరుఫున జస్ప్రీత్ బుమ్రా, సౌతాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ కు చెందిన రచిన్ రవీంద్ర ప్రకటించబడ్డారు.