Is T20 World Cup 2024 moving from Bangladesh: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభానికి రెండు నెలల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉండగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో అక్కడి పరిస్థితి చేజారింది. దాంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దాంతో టీ20 ప్రపంచకప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం బంగ్లా పరిస్థితులపై ఐసీసీ ఓ కన్నేసింది.
బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను ఐసీసీ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో ఐసీసీ ఆధికారులు మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘ఐసీసీ తన సభ్య దేశాలన్నింటిలో స్వతంత్ర భద్రతా పర్యవేక్షణ వ్యవస్థను కలిగి ఉంది. బంగ్లాదేశ్‌లోని పరిస్థితిని ఐసీసీ నిశితంగా పరిశీలిస్తోంది. టోర్నమెంట్ ఆరంభానికి ఇంకా ఏడు వారాలు మిగిలి ఉన్నాయి. అప్పుడే టోర్నీ మార్పు గురించి నిర్ణయం తీసుకోవడం చాలా తొందరపాటు అవుతుంది. అయితే ఆటగాళ్ల భద్రతే మా మొదటి ప్రాధన్యత. అందుకోసం మేము ఏ నిర్ణయం తీసుకోవడానికైనా సిద్దం’ అని ఐసీసీ బోర్డు సభ్యుడు ఒకరు చెప్పినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది.
Also Read: IND vs SL: కోహ్లీ, రోహిత్ అవసరం లేదు.. ఆశిశ్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మహిళల టీ20 ప్రపంచకప్‌కు ప్రత్యామ్నాయ వేదికలు కూడా పరిశీలిస్తోందని తెలుస్తోంది. భారత్, శ్రీలంక, యూఏఈలను బ్యాకప్ ఆప్షన్స్‌గా ఐసీసీ ఉంచినట్లు సమాచారం. మెగా టోర్నీకి ఇంకా 7 వరాల సమయం ఉన్నా.. 2 వారాల ముందే టీమ్స్ అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ చేస్తాయన్న విషయం తెలిసిందే. పురుషుల టీ20 ప్రపంచకప్‌కు శ్రీలంక సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్య ఆతిథ్యం ఇచ్చింది. కాబట్టి బంగ్లాలో కుదరకుంటే.. శ్రీలంకలో టోర్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 20 వరకు మహిళల టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.