Babar Azam: బాబర్ అజామ్ ఆడకపోయినా ఫర్వాలేదా?.. ఐసీసీని ప్రశ్నించిన పాక్ మాజీ ప్లేయర్!
- వన్డే ర్యాంకుల్లో బాబర్ టాప్
- బాబర్ ఆడకపోయినా ఫర్వాలేదా?
- ఐసీసీని ప్రశ్నించిన పాక్ మాజీ ప్లేయర్ అలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basit Ali Fires on ICC: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల విడుదల చేసిన వన్డే ర్యాంకుల్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ముగ్గురు భారత స్టార్లు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ మరియు విరాట్ కోహ్లీలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ ర్యాంకులపై పాక్ మాజీ ప్లేయర్ బసిత్ అలీ విస్మయం వ్యక్తం చేశాడు. నవంబర్ 2023 నుండి వన్డే ఆడనప్పటికీ.. బాబర్ అగ్రస్థానంలో ఎలా ఉంటాడని ఐసీసీని ప్రశ్నించాడు. ఐసీసీ ర్యాంకింగ్ సిస్టమ్ చూస్తే.. బాబర్ ఆడకపోయినా ఫర్వాలేదు అన్నట్లు ఉందని అలీ పేర్కొన్నాడు.
బసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘ఐసీసీ వన్డే ర్యాంకులను చూశా. బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ తర్వాత స్థానాల్లో నిలిచారు. ఇతర పేర్లను చదవాల్సిన అవసరం లేదనుకుంటున్నా. బాగా ఆడుతున్న ట్రావిస్ హెడ్, రచిన్ రవీంద్ర పేర్లు లేవు. ఈ ర్యాంకులను చూస్తుంటే బాబర్ ఆడకపోయినా ఫర్వాలేదు అన్నట్లుగా ఐసీసీ తీరు ఉంది. ఈ ర్యాంకులను ఇచ్చిందెవరు?, దేని ప్రకారం బాబర్, గిల్ టాప్‌లో ఉన్నారు?’ అని ప్రశ్నించాడు.
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
Also Read: Sanju Samson-KBC 16: సంజూ శాంసన్‌పై ప్రశ్న.. పోటీ నుంచి తప్పుకున్న కంటెస్టెంట్! ఎంతపని చేశావయ్యా
‘బాబర్ అజామ్ చివరగా గతేడాది ప్రపంచకప్‌లోనే ఆడాడు. అయినా అతడి ర్యాంకు అలానే ఉంది. శుభ్‌మన్ గిల్ శ్రీలంకపై ఆడినా గొప్ప ప్రదర్శన చేయలేదు. గత వన్డే ప్రపంచకప్‌లో రచిన్, డికాక్, హెడ్, కోహ్లీ తదితరులు అద్భుతంగా ఆడి సెంచరీలు చేశారు. పాకిస్తాన్ తరపున మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్ ఒక్కో సెంచరీ బాదారు. అలాంటప్పుడు ర్యాంకుల విధానం సరిగ్గా లేదని అనిపిస్తోంది’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!