ICC World cup Teams: అమెరికా, వెస్టిండీస్ లో జరిగిన 2024 టి20 ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ తాజాగా ఓ ప్రకటన చేసింది. అదేంటంటే.. రాబోయే ప్రపంచకప్‌లో జట్ల సంఖ్యకు సంబంధించిన ప్రకటన. జూన్‌లో జరిగిన ఈ ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. పురుషుల టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా ఇన్ని జట్లు టోర్నీలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐసీసీ మహిళల టి20 ప్రపంచ కప్ పరిధిని పెంచాలని నిర్ణయించింది. దింతో రాబోయే టోర్నమెంట్లలో టీమ్స్ సంఖ్య 16 కి పెరుగుతుంది. టీ20 క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ, కొత్త దేశాల జట్ల ప్రదర్శన మెరుగుపడుతుండడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
Diamond Necklace: చెత్త కుప్పలో దొరికిన డైమండ్ నెక్లెస్.. చివరకి?
ఐసీసీ వార్షిక సమావేశం శ్రీలంక రాజధాని కొలంబోలో శని, ఆదివారాల్లో జరిగింది. ఇందులో బోర్డు సమావేశం కాకుండా వార్షిక సాధారణ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో అన్ని ఐసీసీ సభ్య బోర్డుల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనది మహిళల టి20 ప్రపంచ కప్‌లో జట్ల సంఖ్యను పెంచడం. పురుషుల, మహిళల క్రికెట్‌లో సమానత్వాన్ని పెంపొందించే భాగంగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. క్రమంగా టోర్నీలో పాల్గొనే జట్ల సంఖ్యను పెంచుతామని ఇంటర్నేషనల్ కౌన్సిల్ డెసిషన్ తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌లో 10 జట్లతో టోర్నమెంట్ నిర్వహించాల్సి ఉంది. ఇకపోతే 2009 లో మొదలైన టి 20 మహిళా ప్రపంచ కప్ లో 8 జట్లు పాల్గొనగా 2016 నుంచి 10 జట్లు ఆడుతున్నాయి. దీని తర్వాత 2026లో జరిగే టోర్నీలో ఈ సంఖ్య 12కి పెరుగుతుంది. ఆపై 2030 నాటికి 16కి పెరుగుతుంది. మొత్తంమీద రాబోయే సంవత్సరాల్లో మరిన్ని దేశాలు ప్రపంచ కప్‌లో పాల్గొనే అవకాశాన్ని పొందబోతున్నాయి.
Charlie Cassell: పెను సంచలనం.. మొదటి మ్యాచ్ లోనే 7 వికెట్లు తీసిన బౌలర్..