భారత్- పాక్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 45 బంతులు ఉండగానే పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో ఫోర్ కొట్టి టీమిండియాకు మర్చిపోలేని విక్టరీని అందించాడు విరాట్ కోహ్లీ. ఈ లెజెండరీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ క్రీజులో అడుగు పెట్టిన దగ్గర్నుంచి పాక్ బౌలర్లను చీల్చి చెండాడాడు.
భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎన్ని పనులు ఉన్నా అన్నీ ముగించుకుని వచ్చి టీవీల ముందు, ఫోన్ల ముందు అతుక్కుపోవాల్సిందే.. భారత్, పాకిస్తాన్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా అభిమానులకు పండగే.. ఎందుకంటే ఈ జట్ల మధ్య మ్యాచ్‌లు తక్కువగా ఉంటాయి. ఈ రెండు జట్ల మధ్య ఎన్నో మరుపురాని మ్యాచ్‌లు జరిగాయి. అందులోనూ ఈ రెండు టీముల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సాధించినట్లయితే అతని పేరిట ఎన్నో రికార్డులు నమోదు అయ్యేవి. ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ సాధించిన మొదటి స్పిన్నర్‌గా అక్షర్ నిలిచేవాడు. అంతేకాకుండా.. ఐసీసీ టోర్నమెంట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా రికార్డులకెక్కే వాడు. ఇప్పటివరకు ఐసీసీ ఈవెంట్‌లలో ఏ భారత స్పిన్నర్ హ్యాట్రిక్ సాధించలేదు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. అతను ఫీల్డింగ్ చేస్తుండగా గాయమైంది. దీంతో.. దుబాయ్‌లో భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు అతను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దూరమయ్యాడు. ఈ క్రమంలో.. ఫఖర్ స్థానంలో ఇమామ్-ఉల్-హక్‌ను జట్టులోకి తీసుకున్నారు.
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఎన్నో ముఖ్యమైన మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్, 2011 ప్రపంచ కప్ సెమీఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ల్లో యువరాజ్ ముందుండి నమ్మకంగా ఆడాడు. అయితే.. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ గురించి ఆయన మాట్లాడుతూ, "ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ఫైనల్ లాగా అనిపిస్తుందని తెలిపారు.
భారత జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక గొప్ప ఘనత సాధించాడు. "హిట్‌మ్యాన్" గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ, వన్డే క్రికెట్‌లో 11,000 పరుగులు చేసిన రెండవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ స్టార్ రషీద్ ఖాన్ పై పొగడతల వర్షం కురిపించాడు. పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్ అని రషీద్ లతీఫ్ అభివర్ణించారు.
IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేటి నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక టీమిండియా నుండి హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్ భారత్ తరఫున అరంగేట్రం చేయబోతున్నారు. గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఆడటం లేదు. 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరు జట్ల మధ్య ఇదే చివరి వన్డే సిరీస్. దీనిని ఛాంపియన్స్…
Marcus Stoinis: ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. వచ్చే నెల 19 ఫిబ్రవరి నుంచి జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధమైన జట్టులో భాగంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయిన్స్ ఆకస్మాత్తుగా వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ రిటైర్మెంట్ నిర్ణయం కేవలం వన్డే క్రికెట్‌కి మాత్రమే పరిమితమని, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మాత్రం ఆడుతూనే ఉంటానని స్టోయిన్స్ స్పష్టం చేశాడు. అయితే,…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతల గురించి ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ తమ అంచనాలను వెల్లడించారు. మైఖేల్ అథర్టన్ మాట్లాడుతూ.. " దక్షిణాఫ్రికాకు మద్ధతిస్తున్నాను. ప్రతి టోర్నమెంట్‌లో గెలిచే వరకు పోరాడతారు. సౌతాఫ్రికా జట్టు బలంగా ఉంది. ఈ ట్రోఫీని దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంటుంది." అని మైఖేల్ అథర్టన్ తెలిపాడు. మాజీ ఇంగ్లీష్ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈసారి భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్‌కు చేరుకుంటాయని అభిప్రాయపడ్డాడు. అంతే…