2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. అతను ఫీల్డింగ్ చేస్తుండగా గాయమైంది. దీంతో.. దుబాయ్‌లో భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు అతను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దూరమయ్యాడు. ఈ క్రమంలో.. ఫఖర్ స్థానంలో ఇమామ్-ఉల్-హక్‌ను జట్టులోకి తీసుకున్నారు.
కాగా.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఫఖర్ జమాన్ చాలా భావోద్వేగంగా కనిపించాడు. అతను డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఏడుస్తూ కనిపించాడు. అతను ఏడుస్తున్న సమయంలో పక్కన బౌలర్ షాహీన్ అఫ్రిది ఓదారుస్తున్నాడు. ఫఖర్ జమాన్ గాయపడినప్పటికీ బ్యాటింగ్ చేశాడు. అతను 41 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. ఔట్ అయిన తర్వాత పెవిలియన్‌కు తిరిగి వస్తూ, అతను చాలా భావోద్వేగానికి గురయ్యాడు.
Read Also: Minister Kollu Ravindra: జగన్‌కు భయం.. అందుకే అసెంబ్లీకి రావడంలేదు..!
34 ఏళ్ల ఫఖర్ జమాన్.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో స్నాయువు కండరాల నొప్పితో ఫీల్డింగ్‌కు రాలేదు. అనంతరం.. ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు రావాల్సింది.. అతని స్థానంలో సౌద్ షకీల్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా వచ్చాడు. జమాన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 41 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా.. ఫఖర్ జమాన్ పాకిస్తాన్ జట్టులో 2023 ప్రపంచ కప్ తరువాత రీఎంట్రీ ఇచ్చాడు. కానీ అతను ఇంకా మోకాలి గాయంతో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.
https://twitter.com/SalmanAsif2007/status/1892641066307727753