Champions Trophy 2025: ప్రస్తుతం పాకిస్తాన్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మెగా టోర్నమెంట్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే జట్లు తలపడనున్నాయి. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీపై ఇప్పటికే అనేక అంచనాలు మొదలయ్యాయి. తాజాగా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌లో తలపడతాయని.. ఈసారి భారత్ విజేతగా నిలుస్తుందని పేర్కొన్నాడు. అదికూడా, భారత్ కేవలం ఒక్క పరుగు…
విరాట్ కోహ్లీ తన వన్డే క్రికెట్ కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ 3000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఐదవ బ్యాట్స్‌మన్‌గా నిలవడానికి ఇంకా 85 పరుగులు మాత్రమే అవసరం.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుండి కోట్ల రూపాయల ప్రైజ్ మనీ పొందనుంది. పాకిస్తాన్‌కు ఐసీసీ నుండి దాదాపు రూ. 2 కోట్ల 37 లక్షల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ టోర్నీలో ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లకు 1.40 లక్షల డాలర్లు అంటే దాదాపు 1 కోటి 22 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్‌కు ప్రైజ్ మనీ అందుతుది.
Wasim Akram: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోరంగా ఓడిపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్‌కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో గెలవలేదు. ఆతిథ్య జట్టు సెమీస్‌కి చేరకుండానే ఇంటి దారి పట్టడంపై పాక్ మాజీ ప్లేయర్లు, జట్టు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో కనీస పోరాటం లేకుండా ఓడిపోవడంపై ఫైర్ అవుతున్నారు.
IND vs PAK: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తన విజయయాత్రను కొనసాగించింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుని 241 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్ధేశించింది. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఈ లక్ష్యాన్ని కేవలం 42.3 ఓవర్లలోనే సులభంగా ఛేదించింది. చివరి పరుగులను విరాట్…
Virat Kohli: క్రికెట్ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ రైవలరీగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ని చూస్తారు. రెండు దేశాల్లో కోట్లాది మంది అభిమానులు కూడా తమ తమ జట్లు గెలవాలని, తమ స్టార్లు సెంచరీలతో చెలరేగాలని కోరుకుంటారు. దశాబ్ధాలుగా ఆ శతృత్వం కొనసాగుతూనే ఉంది. అయితే, పాకిస్తాన్‌కి ఒకే ఒక చింత ఏంటంటే, ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌ని కొట్టలేకపోతోంది. పాక్‌తో పోలిస్తే మెరుగైన ట్రాక్ రికార్డ్ భారత్ సొంతం. Read Also: Belagavi: కర్ణాటక-మహారాష్ట్ర మధ్య…
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తన జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, యాజమాన్యాన్ని కూడా తప్పు పట్టారు. పాకిస్తాన్ జట్టును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంపిక చేసిందని వ్యంగ్యస్త్రాలు సంధించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఆసీస్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది.
పాకిస్తాన్ టీం కొత్త కోచ్‌గా ముదస్సర్ నాజర్ బాధ్యతలు చేపట్టారు. రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ సందర్భంగా.. ఎలాగైనా భారత్ పై గెలవాలనే ఉద్దేశంతో కొత్త కోచ్‌ను నియమించుకున్నారు. క్రికెట్ కోచ్‌గా అనుభవం ఉన్న నాజర్‌కు దుబాయ్‌లోని పరిస్థితులపై మంచి అవగాహన ఉంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన 3వ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో భారీ విజయాన్ని మూటగట్టుకుంది. 43.3 ఓవర్లలో 208 పరుగులకు ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్ అయింది.